Begin typing your search above and press return to search.
ఏపీకి చెంబిచ్చారు.. తెలంగాణకు బిందేనా?
By: Tupaki Desk | 3 Aug 2016 9:29 AM GMTప్రధాని మోడీ తెలంగాణకు తొలిసారిగా ప్రధాని హోదాలో రాబోతున్నారు.. ఆయన రాక సందర్భంగా టీఆరెస్ నాయకత్వం కూడా మంచి హుషారుగా ఉంది. ప్రధాని వస్తే రాష్ట్రానికి కొత్తగా ప్రాజెక్టులు - నిధులు వంటివి సాధించుకునే ఛాన్సు ఉంటందని కూడా ప్లాన్లు వేస్తున్నారట. ఆయన తొలిసారి వస్తుండడంతో ఏమైనా వరాలు ప్రకటిస్తారేమోని కూడా ఆశిస్తున్నారు. అయితే.. మోడీ సంగతి తెలిసినవారు మాత్రం అంత సీను లేదంటున్నారు. తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే అన్న సామెతను మోడీ బాగా ఫాలో అవుతారని... ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపనకు వచ్చినప్పుడే ఆయన ఏమీ ఇవ్వలేదని.. కేవలం ఒక రాగిచెంబుతో మట్టి తెచ్చారని గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు తెలంగాణకు కూడా అలాంటిదే ఏదో ఒకటి తెస్తారని అంటున్నారు.
కాగా మోడీ రాక సందర్భంగా టీఆరెస్ పెట్టుకున్న ఆశలపై సోషల్ మీడియాలోనూ సెటైర్లు పడుతున్నాయి. ఏపీకి రాగిచెంబులో మట్టి తెచ్చినట్లు తెలంగాణ రాగిచెంబులో నీళ్లు తెస్తారేమో అంటూ సెటైర్లు వేస్తున్నారు. మిషన్ భగీరధ పథకం ప్రారంభించడానికి ఆయన వస్తుండడంతో ఇలాంటి అంచనాలు వేస్తున్నారు. మిషన్ భగీరధ కావడంతో తన నియోజకవర్గమైన వారణాసిలోని గంగానది నుంచి తెప్పించానంటూ ఒక చెంబుడు నీటిని తెచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదంటున్నారు రాజకీయ నాయకులు కూడా. మహా అయితే ఏపీకి చెంబు తెచ్చిన మోడీ తెలంగాణ కోసం బిందె తేవొచ్చని చెబుతున్నారు. కొందరైతే ఇంకో మాట కూడా చెబుతున్నారు. పీఎంఓ నుంచి బిందె కొనడానికి నిధులు కూడా రిలీజ్ అయ్యాయని చెబుతున్నారు.
ఏపీకి నోట్లో చెంబుడు మట్టికొట్టిన మోడీ ఇప్పుడు తెలంగాణ ఆశలపై బిందెడు నీళ్లు పోయడం గ్యారంటీ అంటున్నారు రాజకీయ పండితులు. అరిచి గీపెడితేనే ఏమీ ఇవ్వని మోడీ అడక్కుండానే ఏమైనా ఇస్తారనుకుంటే అది అత్యాశేనని చెబుతున్నారు. ప్రత్యేక హోదా కోసం - నిధుల కోసం ఏపీ నేతలు మోడీ ముందు... పార్లమెంటులో గొంతు చించుకుంటున్నా స్పందించని ఆయన తెలంగాణకు తాయిళాలు ప్రకటిస్తారంటే తాము నమ్మలేమని నెటిజన్లు అంటున్నారు. మొత్తానికి మోడీ తత్వం తెలుగు ప్రజలకు, నెటిజన్లకు బాగా అర్థమైపోయినట్లుంది.