Begin typing your search above and press return to search.
`రాజమండ్రి` టీడీపీ రాజకీయంపై సెటైర్లు.. !
By: Tupaki Desk | 18 Sep 2021 6:30 AM GMTరాజకీయాల్లో నాయకుల ప్రాధన్యమే కాదు.. ఇప్పుడు సోషల్ మీడియా ప్రభావం కూడా ఎక్కువగా కనిపి స్తోంది. పార్టీ ఏదైనా.. నాయకులు ఏం చేస్తున్నా.. సోషల్ మీడియా వాచ్ చేస్తోంది. నాయకుల శైలిపై వెంట నే కామెంట్లు పేలుస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ విషయంలో.. టీడీపీ నేతల విషయంలో సోషల్ మీడి యా ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. సహజంగా టీడీపీ కూడా సోషల్ మీడియా రెస్పాన్స్‌ను ఎక్కువగా కోరుకుంటున్న పరిస్థితి ఉంది. ఈ క్రమంలో గత కొన్ని రోజులుగా రాజమండ్రి రాజకీయాలపై ముఖ్యంగా టీడీపీ వ్యవహరిస్తున్న పరిస్థితిపై సోషల్ మీడియాతో విమర్శలు.. కామెంట్లు పెరిగిపోయాయి.
దీనికి ప్రధాన కారణం.. రాజమండ్రిసిటీ నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో ఆదిరెడ్డి భవానీ విజయం ద క్కించుకున్నారు. అదేసమయంలో రూరల్ నియోజకవర్గం నుంచి గోరంట్ల బుచ్చయ్య చౌదరి విజయం సాధించారు. ఈ ఇద్దరు నాయకుల వ్యవహారశైలిపైనే ఇప్పుడు సోషల్ మీడియాలో కామెంట్లు పడుతున్నా యి. భవానీ.. రాజకీయాలకు కొత్తే అయినా.. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న కుటుంబం నుంచి వచ్చా రు. అయితే.. పార్టీ ఏ కార్యక్రమానికి పిలుపు ఇచ్చినా.. ఆమె పాల్గొంటున్నది అత్యంత తక్కువగా నే ఉంది. పైగా.. నియోజకవర్గంలోనూ ఆమె దూకుడు కనిపించడం లేదు. దీంతో ``యువ నాయకురాలు.. నిద్రపో తున్నారు`` అని చాలా మంది కామెంట్లు చేస్తున్నారు.
ఇక, గోరంట్ల పరిస్థితి చూస్తే.. వయోవృద్ధుడు అయినప్పటికీ.. పార్టీ పిలుపు ఇచ్చిన ప్రతి కార్యక్రమంలోనూ ఆయన దూకుడుగా ఉన్నారు. ప్రతి ఒక్కరినీ కలుపుకొని పోతున్నారు. మొత్తంగా.. ఆయన దూకుడుగా ఉన్నారు. అయితే.. ఈయన వయోవృద్ధుడు కావడం.. పైగా వచ్చే ఎన్నికల్లో ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొన నని చెప్పడం వంటి పరిణామాలపై సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి. ``ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ`` అనే కామెంట్లు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. నిజానికి.. వచ్చే ఎన్నికల్లో తాను పోటీకి దిగనని.. గోరంట్ల చెప్పుకొచ్చారు.
పైగా.. ఇటీవల.. ఆయన పార్టీపై ధిక్కార స్వరం వినిపించారు. అయినప్పటికీ.. పార్టీలో దూకుడుగానే ఉన్నారు. కానీ, ఎటొచ్చీ.. ఆదిరెడ్డి భవానీ.. విషయం మాత్రం పార్టీలోనూ చర్చనీయాంశంగా మారింది. మరి ఆమె కుటుంబం యాక్టివ్‌గా ఉంది కనుక.. తాను యాక్టివ్‌గా లేకపోయినా ఫర్వాలేదని.. అనుకుంటున్నారా? లేక.. ఇప్పుడే ఎన్నికలు లేవు కాబట్టి.. ఏం చేసినా.. ప్రయోజనం లేదని భావిస్తున్నారా? అనే కామెంట్లు కూడా వినిపిస్తుండడం గమనార్హం. మొత్తానికి రాజమండ్రి టీడీపీ రాజకీయం సోషల్ మీడియాలో ఆసక్తిగా మారింది.