Begin typing your search above and press return to search.
'చాయ్ వాలా' అప్డేటెడ్ వెర్షన్ ఎటకారం మామూలుగా లేదుగా?
By: Tupaki Desk | 24 July 2022 4:48 AM GMTదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఉన్న జనాకర్షణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం. అలాంటి పవర్ ఫుల్ నేతతో సర్దుకుపోవటమే తప్పించి.. తేడా చేస్తే.. ఏదేదో జరిగిపోతుందన్న భయం దేశంలోని పలువురు రాజకీయ అధినేతల్లో స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోకుండా కాలు దువ్విన పలువురు అందుకు భారీ మూల్యం చెల్లించారన్న మాట వినిపిస్తూ ఉంటుంది. అలాంటివేళలో.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాధినేత కేసీఆర్ మోడీ మీద ఫైర్ కావటమే కాదు.. ఆయనపై వార్ ప్రకటించటం తెలిసిందే.
ఇలాంటివేళ.. మోడీ మీద యుద్ధం ఎంత కఠినమైన..కష్టమైనదన్నది తెలిసిందే. అందుకే ఆయన మిగిలిన వారికి భిన్నంగా ఎంతో అప్రమత్తతో వ్యవహరిస్తూ.. రాజకీయ దాడి షురూ చేశారు. మిగిలిన రాష్ట్రాల్లో.. మరెక్కడా లేనంతగా ఆయన ఇమేజ్ డ్యామేజ్ చేసే సరికొత్త ప్రచారాల్ని చేపడుతున్నారు. గడిచిన మూడు.. నాలుగు నెలల్లో తెలంగాణ రాష్ట్రానికి విచ్చేసిన మోడీకి.. అనూహ్యమైన రీతిలో పంచ్ లు పడేలా ప్రచారాల్ని నిర్వహించటం తెలిసిందే.
కేంద్రం రాష్ట్రానికి ఏమీ చేయలేదన్న మాటను హైలెట్ చేస్తూ.. హైదరాబాద్ మహానగరంలోని పలు ప్రాంతాల్లో అకస్మాత్తుగా హోర్డింగులు.. బ్యానర్లు.. ఫ్లెక్సీలు ఏర్పాటు కావటం తెలిసిందే. ఇదిలాఉంటే.. తాజాగా హైదరాబాద్ మహానగరంలో వెలిసిన ఒక హోర్డింగ్ ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది. చాయ్ వాలాగా సుపరిచితమైన మోడీకి పర్ పెక్టు పంచ్ అన్న రీతిలో దీన్ని రూపొందించటం గమనార్హం.
ఒక దేశం ఒక పన్ను పేరుతో తీసుకొచ్చిన జీఎస్టీని.. ప్రధాని మోడీ జనాల మీద బాదేయటం ఈ మధ్యన ఎక్కువైందన్న విమర్శ పెరుగుతోంది.. ప్రతి వస్తువుకు.. వస్తు సేవకు పన్ను పోటు పరిధిలోకి తీసుకురావటం ఎక్కువైంది. రీసెంట్ గా పాలు.. పాల ఉత్పత్తుల మీద కూడా జీఎస్టీ పరిధిలోకి తీసుకురావటం..దీనిపైన రాజకీయ పార్టీలతో పాటు.. దేశ ప్రజలు సైతం తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పరిస్థితి. ఇలాంటివేళ.. ఆయన ఇమేజ్ ను మరింత ఖరాబు చేసేందుకు వినూత్నమైన ప్రచారాల్ని తీసుకొస్తున్నారు. అలాంటిదే ఇప్పుడు హైదరాబాద్ లో కనిపిస్తూ అందరి నోట నానుతోంది.
మోడీ అన్నంతనే చాయ్ వాలాగా గుర్తుకు రావటం తెలిసిందే. మోడీ చిన్నతనంలో ఆయన రైల్వే స్టేషన్ లో టీ అమ్మటం తెలిసిందే. అందుకే చాయ్ వాలా పేరుతో ఆయన్ను పిలుస్తూ.. ఆయన ఇమేజ్ ను పెంచే ప్రయత్నం చేస్తారు. దీనికి అసలుసిసలు పంచ్ అన్నట్లుగా సరికొత్త ప్రచారం మొదలైంది.
అందులో.. 'చాయ్ వాలా అప్డేటెడ్ వెర్షన్ 'టాక్స్ వాలా' అంటూ భారీ పంచ్ వేశారు. ప్రకాశ్ ఆర్ట్స్ పరిధిలో ఉండే హోర్డింగ్ మీద ఏర్పాటు చేసిన దీన్ని.. ఎవరు వేయించారు? అన్న దానిపై ఎలాంటి సమాచారం లేకుండా దాన్ని ఏర్పాటు చేశారు. ఇదే హోర్డింగ్ కింద ఉన్న బస్టాప్ లో కేసీఆర్ సర్కారు అమలు చేస్తున్న కల్యాణలక్ష్మీ పథకానికి సంబంధించిన హోర్డింగ్ ఏర్పాటు కావటం ఉంది.
అంటే.. పైన మోడీ సర్కారును పన్నులతో బాదేసే ప్రభుత్వాధినేతగా అభివర్ణించటం.. కింద మాత్రం సంక్షేమ పథకాల్ని అమలు చేసే ప్రభుత్వాధినేతగా చూపటం చూస్తే.. విషయం ఏమిటన్నది ఇట్టే అర్థమైపోతుంది. ఏమైనా.. మోడీ ఇమేజ్ ను దెబ్బ తీసేలా.. సూటిగా.. అందరూ నిజమే కదా? అనుకునేలా చేస్తున్న ఈ ప్రచారం కమలనాథులకు ఇరిటేట్ చేసేలా ఉంటుందని మాత్రం చెప్పక తప్పదు.
ఇంతకూ ఈ తరహా ప్రచారాన్ని చేపట్టే దమ్ము.. ధైర్యం ఎవరిదన్న విషయానికి ఎవరికి వారు సమాధానం చెప్పేస్తారు.కానీ.. ఆ హోర్డింగ్ లో మాత్రం ఈ విమర్శ చేస్తున్నది ఎవరన్న దానిపై సమాచారం లేకుండా ఉండటం అసలుసిసలు ట్విస్టు. దేశ ప్రధానిపై ఘాటు విమర్శ చేసేంత ధైర్యం ఉన్నప్పటికీ.. దానికి సంబంధించిన వివరాల్ని మాత్రం లేకుండా జాగ్రత్తపడటం కనిపిస్తుంది. మరి.. దీనికి కమలనాథులు ఎలా రియాక్టు అవుతారో చూడాలి.