Begin typing your search above and press return to search.

పులివెందులలో గెలుపు.. ఆయనదో తీరని కల..

By:  Tupaki Desk   |   28 May 2019 11:44 AM GMT
పులివెందులలో గెలుపు.. ఆయనదో తీరని కల..
X
ఆయనదో కల.. పులివెందుల ఎమ్మెల్యేగా గెలవాలన్నది ఆయనది ఆశ.. ఆ కలను నెరవేర్చుకోవడానికి ప్రతి ఎన్నికల్లోనూ పోటీపడుతున్నారు. ఇప్పటికి 5 సార్లు పోటీచేసి ఓడిపోయారు.. ఒకే ఒక్క ఫ్యామిలీ ఆయన కలను దూరం చేస్తోంది. అదే వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఫ్యామిలీ..

సతీష్ రెడ్డి. పులివెందుల టీడీపీ అభ్యర్థి. గడిచిన 20 ఏళ్లకు పైగా ఆయన అక్కడి నుంచే పోటీచేస్తున్నాడు. ఒక్కసారి గెలుపుకోసం తాపత్రాయపడుతున్నారు. కానీ ఆయన కల నెరవేరడం లేదు. ఎమ్మెల్యేగా గెలవాలనుకున్న ప్రతీసారి వైఎస్ ఫ్యామిలీ చేతుల్లో ఓడిపోతున్నారు.

సతీష్ రెడ్డి 1999లో తొలిసారి వైఎస్ పై పోటీచేశారు. అప్పుడు వైఎస్ చేతిలో ఓడిపోయారు. ఇక 2004, 2009లో కూడా ఇలానే వైఎస్ చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత జగన్ చేతిలో 2014లోనూ ఓడారు..

ఇక 2019లో ఓడితే రాజకీయ సన్యానం తీసుకుంటానని సవాల్ చేశారు. చంద్రబాబు కూడా జగన్ ను ఓడించేందుకు ‘ఆపరేషన్ పులివెందుల’ అంటూ భారీగా నిధులు, టీడీపీని మోహరించి జగన్ ను ఓడించేందుకు శతవిధాలా ప్రయత్నించారు. కానీ అది సాధ్యపడలేదు. 2019లోనూ జగన్ లక్షకు చేరువైన మెజార్టీతో గెలిచారు.

విశేషం ఏంటంటే పులివెందుల నియోజకవర్గంలో వేంపల్లి మండలం సతీష్ రెడ్డి సొంత ఇలాకా.. ఇక్కడ 5వేలకంటే తగ్గితే మళ్లీ పోటీచేయనన్నారు. ఆ కల నెరవేరలేదు. 5వేల లోపే ఓట్లు రాగా.. జగన్ కు 14వేల మెజార్టీ వచ్చింది. దీంతో రాజకీయ సన్యాసం అని ప్రకటించిన సతీష్ రెడ్డి ఫలితాలు వచ్చిన తర్వాత మీడియా కంటపడడం లేదు. మరి 2024లో పోటీచేస్తాడా.? టీడీపీ వేరే అభ్యర్థిని వెతుక్కోవాలా అనేది తేలాల్సి ఉంది.