Begin typing your search above and press return to search.
ఏడాదికి ఓ తెలుగోడి జీతం జస్ట్.. రూ.117 కోట్లే
By: Tupaki Desk | 5 Oct 2016 4:41 AM GMT తెలుగోడు తక్కువేం కాదన్న విషయాన్ని ఇప్పటికే పలువురు నిరూపించారు. తెలుగోడి సత్తాను చాటే పరిణామాలు ఇప్పటికే చాలానే చోటు చేసుకున్నాయి. తాజాగా చోటుచేసుకున్న పరిణామం మరోసారి తెలుగోడి సత్తా ఏమిటో చాటటమే కాదు.. అంతులేని స్ఫూర్తిని ఇస్తుందనటంలో సందేహం లేదు. ఇంతకీ ఆ తెలుగోడు ఎవరు? ఆయనేం చేశారు? అన్న ముచ్చట్లోకి వెళితే..
ప్రఖ్యాత మైక్రోసాఫ్ట్ సీఈవోగా వ్యవహరిస్తున్న సత్య నాదెళ్ల సుపరిచితులు. ఆయన్ను స్ఫూర్తిగా తీసుకునే వారు కోట్లాది మంది ఉంటారు. స్వయంకృషితో ఎదిగిన ఆయన తాజా శాలరీ ప్యాకేజీ ఇప్పుడు వార్తాంశంగా మారింది. ఆయన మొత్తం శాలరీ ప్యాకేజీ అంటే.. బేసిక్.. అలవెన్సులు.. వగైరా వగైరా కలిపితే ఏకంగా రూ.117 కోట్లు కావటం గమనార్హం. వామ్మో అంత జీతమా? అనిపించొచ్చు. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. ఆయన గతేడాది జీతంతో పోలిస్తే..ఈసారి ఆయన జీతం దాదాపు మూడు శాతం మేర తగ్గింది.
గతేడాది ఆయన శాలరీ ప్యాకేజీ 1.83 కోట్ల డాలర్లు కాగా.. ఈసారి ఆయన ప్యాకేజీ 1.77 కోట్ల డాలర్లు. మూడు శాతం మేర తగ్గినప్పటికీ.. ఏడాదికి రూ.117 కోట్ల ఆదాయం అంటే మాటలా? ఇంతకీ సత్య నాదెళ్ల జీతం తగ్గటానికి కారణం ఏమిటి? అన్న అంశాన్ని చూస్తే.. స్టాక్ ఆప్షన్స్ తగ్గటమే ప్యాకేజీ తక్కువ కావటానికి కారణంగా చెప్పొచ్చు. సత్య నాదెళ్ల పదవీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఇప్పటివరకూ చూస్తే.. మైక్రోసాఫ్ట్ షేర్ 70 శాతం పెరిగింది. అయినప్పటికీ..ఆయన జీతం కాస్త తగ్గటం గమనార్హం. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు బయటకు రావాల్సి ఉన్నా ఒక్క విషయం మాత్రం క్లియర్.. ఒక తెలుగోడు తన స్వయంకృషితో ఇంత భారీ వేతనాన్ని.. అంతకు మించి మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీకి దిశానిర్దేశం చేసే స్థానంలో ఉండటం సామాన్యమైన విషయం కాదని చెప్పక తప్పదు. దాంతో పోలిస్తే.. తగ్గిన మూడు శాతం జీతం పెద్దలెక్కలోకి రాకపోవచ్చు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/