Begin typing your search above and press return to search.
సత్య నాదెళ్ల భవిష్యత్తు చూపిస్తున్నాడు
By: Tupaki Desk | 1 April 2016 6:22 AM GMTగతంలో ఎవరైనా భవిష్యత్తు గురించి చెబితే ఆసక్తికరంగా అనిపించేది. కానీ.. కొద్దిరోజులుగా వినిపిస్తున్న భవిష్యత్తు మాటలు వింటే భయంతో వణికిపోయే పరిస్థితి. ఈ మధ్య కాలంలో చోటుచేసుకుంటున్న మార్పుల పుణ్యమా అని.. రానున్న రోజుల్లో అందుబాటులోకి వచ్చే అత్యున్నత సాంకేతికతతో ‘మనిషి’ ఆస్తిత్వానికే ముప్పు ఏర్పడుతుందా? అన్న భావన కలగటం ఖాయం.
తాజాగా మైక్రోసాఫ్ట్ సీఈవో.. మన తెలుగోడు సత్య నాదెళ్ల మాటల్నే తీసుకుంటే.. భవిష్యత్ చిత్రం కళ్ల ముందు కనిపించి భయాన్ని కలిగిస్తుంది. పాజిటివ్ గా చూసినప్పుడు అబ్బురంగా అనిపించినా.. ఆ వెనుకనే ఉండే నెగిటివ్ మీద దృష్టి పెట్టినప్పుడు మాత్రం ఆందోళన కలగటం ఖాయం. కంప్యూటర్లు మానవ భాషను నేర్చుకుంటాయని.. అచ్చం మనుషులు మాట్లాడుకున్నట్లుగానే కంప్యూటర్లు మాటామంతీ జరుపుతాయని సత్య నాదెళ్ల చెబుతున్నారు.
మనుషులు.. మెషీన్లు మాట్లాడే రోజు భవిష్యత్ లో సాకారం కానుందని ఆయన చెబుతున్నారు. ఇప్పటికే రోబోలు మనిషి జీవితంలోకి వచ్చేశాయి. రానున్న రోజుల్లో యంత్రుడి అధీనంలోకి మనిషి వెళతాడా? అన్న సందేహాలు కలుగుతున్న పరిస్థితి. మరోవైపు బంధాలు రోజురోజుకీ పలుచనై.. ఎప్పుడు ఎవరిని నమ్మాలో అర్థం కాని ఇబ్బందికర పరిస్థితి చుట్టూ నెలకొంది. తండ్రిని చంపే కొడుకు.. బిడ్డను చంపుకునే తల్లి.. భర్తను భార్య.. భార్యను భర్త.. ఇలా ఏ బంధాలు చూసినా అపనమ్మకం చుట్టూ తిరుగుతున్నట్లుగా చుట్టూ ఉన్న సమాజంలోని పరిస్థితులు వేగంగా మారిపోతున్నాయి.
పాతికేళ్ల క్రితం చిన్న పిల్లల్ని తెలిసిన వారికి అప్పజెప్పినా క్షేమంగా ఉంటారన్న ధీమా ఉండేది. కానీ.. ఇప్పుడు అయిన వాళ్లకు తప్పించి అందరికి పిల్లల్ని వదిలే పరిస్థితి లేదు. రోజురోజుకీ పరిస్థితులు సంక్లిష్టంగా మారిపోతున్న నేపథ్యంలో. . సాంకేతికత మరింత దూకుడుగా ముందుకొస్తే.. మనిషికి మనిషి మధ్య అనుబంధం తగ్గి.. మనిషికి.. యంత్రానికి అనుబంధం పెరగటం ఖాయం. అదే జరిగితే.. ఇప్పటికే ఇంట్లో వాళ్ల కంటే చేతిలో ఉండే సెల్ ఫోన్ అత్యంత అవసరమైనది మారిపోయిన సంగతి తెలిసిందే. భవిష్యత్తులో తనను కంటికి రెప్పలా చూసుకునే రోబో లాంటి యంత్రాల అధీనంలోకి మనిషి వెళ్లిపోతాడేమో..? అదే జరిగితే.. సాటి మనిషితో మాట్లాడలేని మనిషి యంత్రాలతోనే తన జీవితం అయినప్పుడు.. భవిష్యత్తు అందంగా ఉండే ఛాన్స్ ఉందా..?