Begin typing your search above and press return to search.
సత్య నాదెళ్ల ఇళ్లు అమ్మేస్తున్నాడు
By: Tupaki Desk | 11 Jan 2016 1:02 PM GMTమైక్రో సాఫ్ట్ సీఈవో సత్యా నాదెళ్ల తన ఇళ్లు అమ్మకానికి పెట్టాడు. వాషింగ్టన్‌లోని క్లైడ్ హిల్స్ లో ప్రస్తుతం ఉంటున్న అద్భుతమైన ఇంటిని అమ్మేందుకు సత్య నిర్ణయం తీసుకున్నారు. ఈ ఇంటిని $3.488 మిలియన్ డాలర్లకు (సుమారు 23 కోట్లు) సత్యనాదెళ్ల అమ్మకానికి పెట్టారు. ఈ అమ్మకం ద్వారా కూడా సత్య పెద్ద ఎత్తున లాభం పొందుతుండటం ఆసక్తికరం. ఇరవై ఏళ్ల క్రితం కేవలం $1.385 మిలియన్ డాలర్లకు సత్య నాదెళ్ల కొనుగోలు చేశారు. ప్రస్తుతం దాదాపు రెట్టింపు కంటే ఎక్కువ మొత్తానికి తన ఇంటిని అమ్ముతున్నారు.
అమెరికా కరెన్సీ ప్రకారం ఈ మొత్తం భారీగానే ఉన్నప్పటికి సత్య కలిగి ఉన్న ఇంటి సౌకర్యాల ప్రకారం చూస్తే ఈ మొత్తం పెద్ద ఎక్కువేం కాదని అంటున్నారు. మెట్ ఒలింపస్, లేక్ వాషింగ్టన్ సౌందర్యాన్ని ఆస్వాదించేలా ఉన్న సత్య ప్రస్తుత నివాసం ప్రకృతి సౌందర్యంతో మమేకం అయి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉండే విధంగా ఉంది. 1963లో నిర్మించిన ఈ ఇంట్లో 4,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. సత్య ఇంట్లో నాలుగు బెడ్రూంలు, 3 బాత్రూంలు, 2 ఫైర్ ప్లేస్‌లు ఉన్నాయి. డైనింగ్ రూమ్ లు - ఈట్ ఇన్ కిచెన్ - ఫ్యామిలీ రూమ్ - లాఫ్టెడ్ ఆఫీసు - లైబ్రరీ - వంటివన్నీ కలుపుకుంటే 4,050 చదరపు అడుగుల విస్తీర్ణం ఉంటుంది.
ప్రపంచ ప్రఖ్యాత సంస్థ సీఈవో నివసిస్తున్న ఇళ్లు ఆయన ఆలోచన విధానానికి,అభిరుచులకు తగ్గట్లు ఉంటుంది. అలాగే కొనుగోలుదారుడికి కూడా అదే అనుభూతిని ఇస్తుందని చెప్తున్నారు.