Begin typing your search above and press return to search.
సత్య నాదెళ్ల మళ్లీ అమ్మేశాడు
By: Tupaki Desk | 12 Aug 2018 4:24 AM GMTతెలుగోడు.. అంత పెద్ద మైక్రోసాఫ్ట్ ని లీడ్ చేస్తున్న ప్రముఖుడు సత్య నాదెళ్ల. కంపెనీలో తన వాటా కింద ఉన్న షేర్లలో మూడింట ఒక వంతును అమ్మేసిన వైనం ఆసక్తికరంగా మారింది. తాజాగా అమ్మిన షేర్లతో అతగాడికి 3.5 కోట్ల డాలర్ల ఆదాయం వచ్చింది. మన రూపాయిల్లో చెప్పాలంటే 240 కోట్లు.
ఆయన చేతికి వచ్చినప్పటి షేర్ ధరతో పోలిస్తే.. తాజాగా ఉన్న ధర మూడు రెట్లు ఎక్కువైనట్లుగా చెబుతున్నారు. ఏడాది కాలంలోనే షేర్ ధర 53 శాతం పెరిగటం గమనార్హం. ఇదిలా ఉంటే.. ఈ వీకెండ్‌లో మైక్రోసాఫ్ట్ షేర్ ధర 109 డాలర్లకు ట్రేడ్ అయ్యింది. జులై 25న రికార్డు స్థాయిలో 110.83 డాలర్లకు లిస్టై సరికొత్త రికార్డును సృష్టించింది.
తన దగ్గరున్న షేర్లను అమ్మటం సత్య నాదెళ్లకు కొత్తేం కాదు. గతంలోనూ.. అంటే రెండేళ్ల క్రితం సత్య నాదెళ్ల తన వాటాలోని కొన్ని షేర్లను అమ్మేశారు. అప్పట్లో మైక్రోసాఫ్ట్ షేర్ ధర 58 డాలర్లు ఉండేది. ఇప్పుడు రెట్టింపు ధరకు ఆయన 3.28 లక్షల షేర్లను అమ్మేశారు.
2014 ఫిబ్రవరిలో మైక్రోసాఫ్ట్ పగ్గాలు చేపట్టిన సత్య నాదెళ్ల దగ్గర ప్రస్తుతం 7.78లక్షల షేర్లు ఉన్నాయి. నిబంధనల ప్రకారం ఆయన తన కనీస వేతనానికి 15 రెట్లు ఎక్కువ విలువైన షేర్లు కలిగి ఉండాలి. గత ఏడాది కనీస వేతనంగా 1.4 కోట్ల డాలర్ల వేతనాన్ని తీసుకున్న ఆయన తాజాగా 2 కోట్ల డాలర్ల పారితోషికాన్ని అందుకుంటున్నారు.