Begin typing your search above and press return to search.

మోడీతో షేక్ హ్యాండ్ అంతగా దులిపేసుకోవాలా?

By:  Tupaki Desk   |   30 Sept 2015 3:51 PM IST
మోడీతో షేక్ హ్యాండ్ అంతగా దులిపేసుకోవాలా?
X
రోజులు మారిపోయాయి. అత్యంత ముఖ్యమైన వ్యక్తులు కాలు బయటపెట్టారంటే వేలాది కెమేరా కళ్లు వారిని నిశితంగా గమనిస్తుంటాయన్న విషయాన్ని మర్చిపోతే పరిస్థితి ఎంత ఇబ్బందికరంగా ఉంటుందన్న విషయం మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్లకు తెలిసి ఉంటుంది.

ప్రధాని మోడీ తాజా అమెరికా పర్యటన సందర్భంగా ప్రముఖ సీఈవోలను కలిసిన సందర్భంగా సత్యనాదెళ్ల చర్య ఇప్పుడు సోషల్ మీడియాలో ఇప్పుడు హడవుడి చేస్తుంది.

ప్రధాని మోడీ షేక్ హ్యాండ్ ఇచ్చిన అనంతరం ముందుకొచ్చిన సత్యనాదెళ్ల చేతులు దులుపుకుంటున్న తీరు నవ్వు తెప్పించేలా ఉంది. మోడీతో షేక్ హ్యాండ్ ను అవమాన పరిచేలా సత్యనాదెళ్ల చేష్టలు ఉన్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఉద్దేశ్య పూర్వకంగా సత్యనాదెళ్ల అలా చేసి ఉండరని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. అలా చేతులు దులుపుకోవటం సత్య నాదెళ్ల బాడీ లాంగ్వేజ్ గా కొందరు సమర్థించే ప్రయత్నం చేస్తున్నారు. మరికొందరు మాత్రం ప్రధాని మోడీని అవమానించేలా వ్యవహరించారని మండి పడుతున్నారు. మొత్తానికి సత్యనాదెళ్ల చేతులు దులుపుకోవటం ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతోంది.