Begin typing your search above and press return to search.

కరోనాపై పోరాటానికి సత్య నాదెళ్ల భార్య విరాళం

By:  Tupaki Desk   |   24 March 2020 5:30 PM GMT
కరోనాపై పోరాటానికి సత్య నాదెళ్ల భార్య విరాళం
X
కరోనాపై పోరాటానికి ప్రముఖుల సాయపడుతున్నారు. ఇప్పటివరకు దేశాలకు దేశాలు సహకరించుకున్నాయి. కానీ ఇపుడు వ్యక్తులు ప్రభుత్వాలకు విరాళాలు అందజేస్తున్నారు. అనంతపురం ప్రాంతానికి చెందిన సత్యనాదెళ్ల ప్రస్తుతం మైక్రోసాఫ్ట్ ను లీడ్ చేస్తున్నారు. ఆయన భార్య అనుపమ తెలంగాణ ప్రభుత్వానికి 2 కోట్ల విరాళం ప్రకటించారు. ఈ మేరకు ఆ చెక్కును అనుపమ తండ్రి, మాజీ ఐఏఎస్ అధికారి కేఆర్ వేణుగోపాల్ కేసీఆర్ కి అందజేశారు. ముఖ్యంగా కరోనా నేపథ్యంలో ఆదాయం కోల్పోయిన పేదలను ఆదుకోవడానికి ఈ చెక్కును వారు అందజేశారు. ప్రగతి భవన్ లో కేసీఆర్ ను వేణుగోపాల్ కలిశారు.

ఇదిలా ఉండగా.. ఇప్పటికే హీరో నితిన్ కూడా కేసీఆర్ ను స్వయంగా కలిసి రూ.10 లక్షల చెక్కును కేసీఆర్ కు అందజేసిన విషయం తెలిసిందే. నితిన్ ఏపీకి కూడా పది లక్షలు విరాళం ఇవ్వడం గమనార్హం. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇన్ని రోజులు స్టేట్ లాక్ డౌన్ చేయడం తో రోజు వేతనంపై బతికే వారికి గడ్డురోజులు ఏర్పడ్డాయి. టీఎన్జీవో, టీజీవో ఉద్యోగులు కూడా ఒకరోజు వేతనాన్ని విరాళంగా ప్రకటించారు. 48 కోట్లు రూపాయలు ఇస్తున్నట్లు అంగీకార పత్రాన్ని ఉద్యోగ సంఘాల జేఏసీ నాయకులు శ్రీ కె. రవీందర్ రెడ్డి, శ్రీమతి మమత సీఎంకు అందజేశారు. ఈ విరాళాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. కొందరు అజ్జాతంగా సీఎం రిలీఫ్ ఫండింగ్ కు పంపిస్తున్నారు.