Begin typing your search above and press return to search.
లోకేష్ బాబుకు బాసటగా టాలీవుడ్ నిర్మాత!
By: Tupaki Desk | 23 Nov 2017 1:15 PM GMT`నంది` వివాదం సద్దుమణుగుతోందనుకున్న సమయంలో ఏపీ మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యలు పెను దుమారాన్ని రేపిన సంగతి తెలిసిందే. అప్పటికరకు కేవలం టాలీవుడ్ - ఏపీ ప్రభుత్వం - జ్యూరీ సభ్యులకు పరిమితమైన వివాదం....లోకేష్ రాకతో ప్రాంతీయ సమస్యగా మారింది. రాష్ట్ర విభజనానంతరం సద్దుమణిగిన `టాలీవుడ్ ప్రాంతీయ` సమస్య ను మళ్లీ తెరపైకి తెచ్చిన ఘనత చినబాబుదే. ప్రస్తుతం ఒక తల్లి బిడ్డల్లాగా కలిసి మెలిసి ఎవరి మానాన వారు బ్రతుకుతున్న కళాకారుల మధ్య చినబాబు చిచ్చు పెట్టారు. అవార్డులతో మొదలైన వివాదాన్ని.... ఆధార్ పేరు చెప్పి ఆంధ్ర బోర్డర్ దాటించేశారు. అవార్డుల ఎంపికపై ప్రశ్నించినంత మాత్రాన ఆంధ్రవాళ్లం కాకుండా పోతామా.....అంటూ నటుడు పోసాని తీవ్రస్థాయిలో లోకేష్ పై విరుచుకుపడ్డారు. ఏదైనా మాట్లాడే ముందు ఆలోచించుకోవాలని, అవగాహన లేమితో మాట్లాడి తన తండ్రి పరువు, రాష్ట్రం పరువు తీయొద్దని టాలీవుడ్ సీనియర్ నిర్మాత, దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ....లోకేష్ బాబుకు చురకలంటించిన సంగతి తెలిసిందే.
లోకేష్ బాబు ప్రతిభాపాటవాలు - మాటతీరు - విషయ పరిజ్ఞానం గురించి ఆంధ్ర, తెలంగాణ ప్రజలకు ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆయన బాధ్యతారహిత వ్యాఖ్యలపై సొంతపార్టీ నేతలే తలలు పట్టుకున్న సందర్భాలు కోకొల్లలు. అటువంటిది నివురుగప్పిన నిప్పులా ఉన్న`నంది` వివాదానికి చినబాబు ఆజ్యం పోయడంపై టీడీపీ నేతలు కూడా అసహనం వ్యక్తం చేసినట్లు పుకార్లు వచ్చాయి. అందుకే, పోసాని - తమ్మారెడ్డి ఘాటుగా లోకేష్ ను విమర్శించినప్పటికీ టీడీపీ నేతలు తీవ్రస్థాయిలో రిటార్ట్ ఇవ్వలేదు. కేవలం లోకేష్ బాబు మాత్రమే....తన ఆధార్ కార్డు ఆంధ్రాలో ఉందని పసలేని రిటార్ట్ ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే, తాజాగా సత్యారెడ్డి అనే నిర్మాత ....చినబాబు తరపున వకాల్తా పుచ్చుకున్నారు. అంతవరకు పర్వాలేదు, కానీ, ఆయన ఏకంగా ఆరు కోట్ల ఆంధ్రా ప్రజల తరపున వకాల్తా పుచ్చుకోవడమే కాకుండా, వారి తరపున తీవ్ర ఆవేదనను మీడియా సాక్షిగా వెళ్లగక్కారు. పోసాని వ్యాఖ్యలకు ఆంధ్రా ప్రజలు అవమానభారంతో కుంగిపోతున్నారని స్టేట్ మెంట్ ఇచ్చేశారు. అపుడెపుడో 2010లో `గ్లామర్` అనే సినిమాలో నటించడమే కాకుండా ఆ చిత్రానికి నిర్మాణ - దర్శకత్వ బాధ్యతలు వహించిన సత్యారెడ్డి....తాజాగా టీడీపీ తరపున వకాల్తా పుచ్చుకొని మీడియా ముందుకు రావడం విశేషం. ఇప్పటివరకు టాలీవుడ్ కు చెందిన పెద్ద తలకాయలు ఎవరూ నంది వివాదంపై ప్రభుత్వానికి బాసటగా మీడియా ముందుకు రాలేదు. కొంతమంది తటస్థంగా ఉన్నా - జ్యూరీ సభ్యుల, ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించిన వారే ఎక్కువ. ఈ నేపథ్యంలో టీడీపీ ప్రోద్బలంతోనే సత్యారెడ్డి తెరపైకి వచ్చారన్నది జగమెరిగిన సత్యం. నంది వివాదంలో....ఆల్రెడీ లోకేష్ బాబు వ్యాఖ్యలతో టీడీపీ పరువు సగం మంట గలిసింది, తాజాగా సత్యారెడ్డి ప్రెస్ మీట్ తో ఆ మిగతా సగం కూడా మంటగలిసిందనేది విశ్లేషకుల అభిప్రాయం. పోసాని, తమ్మారెడ్డి వ్యాఖ్యలు వ్యక్తిగతం....అది వారి ఆవేదన. కానీ, ఓ మంత్రి హోదాలో లోకేష్ బాబు వ్యాఖ్యలు ప్రభుత్వాన్ని ప్రతిబింబిస్తాయి. మరి, ఈ చిన్న లాజిక్ ను టీడీపీ ఎలా మిస్ అయిందో అర్థం కాని పరిస్థితి!