Begin typing your search above and press return to search.

స‌త్యం రాజుగారి ద‌గ్గ‌ర ఫోన్ ఉందా?

By:  Tupaki Desk   |   7 May 2015 9:26 AM GMT
స‌త్యం రాజుగారి ద‌గ్గ‌ర ఫోన్ ఉందా?
X
స‌త్యం రామ‌లింగ‌రాజు మ‌రోసారి వార్త‌ల్లోకి వ‌చ్చారు. స‌త్యం కుంభ‌కోణంలో దోషిగా నిరూపిత‌మై ప్ర‌స్తుతం జైల్లో ఉన్న ఆయ‌న‌.. తాజాగా ఒక వివాదాస్ప‌ద అంశంతో వార్త‌ల్లోకి వ‌చ్చారు.
కోర్టు విధించిన శిక్ష‌ను అనుభ‌విస్తు ప్ర‌స్తుతం చ‌ర్ల‌ప‌ల్లి జైల్లో ఉన్న రామ‌లింగ‌రాజు వ‌ద్ద నుంచి జైలు అధికారులు ఒక సెల్‌ఫోన్ ను.. మ‌రో రెండు సిమ్ కార్డుల‌ను స్వాధీనం చేసుకున్న‌ట్లుగా వార్త‌లు వ‌చ్చాయి.
దీంతో.. ఒక్క‌సారి క‌ల‌క‌లం రేగింది. క‌రుడుగ‌ట్టిన ఖైదీల వ‌ద్ద నుంచి.. నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా సెల్ ఫోన్ లాంటివి ఉండ‌టం.. వాటిని స్వాధీనం చేసుకోవ‌టం మామూలే. కానీ.. స‌త్యం రామ‌లింగ‌రాజు లాంటి ప్ర‌ముఖ‌ల ద‌గ్గ‌ర సెల్ ఫోన్ బ‌య‌ట‌ప‌డింద‌న్న వార్త క‌ల‌కం రేపుతోంది. అయితే.. రామ‌లింగ‌రాజు నుంచి సెల్ ఫోన్ లాంటివేమీ బ‌య‌ట‌ప‌డ‌లేద‌ని జైలు అధికారులు చెబుతున్నారు. రామ‌లింగ‌రాజు నుంచి సెల్‌ఫోన్‌ను జైలు అధికారులు స్వాధీనం చేసుకున్న వార్త‌ల‌న్ని నిరాధారం అని.. అలాంటిదేమీ లేద‌ని చెబుతున్నారు. బెయిల్ కోసం ప్ర‌య‌త్నిస్తున్న‌.. రామ‌లింగ‌రాజుకు తాజా ఆరోప‌ణ‌లు ఇబ్బందిక‌రంగా ప‌రిణ‌మించే ప్ర‌మాదం ఉంద‌న్న వాద‌న‌లు వినిపిస్తున్నాయి.