Begin typing your search above and press return to search.
రజనీ పార్టీ పెట్టే నెల ఫిక్స్ చేశారట
By: Tupaki Desk | 30 Nov 2017 6:47 AM GMTతమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ రంగప్రవేశం మీద ఇప్పటివరకూ వచ్చిన ఊహాగానాలు.. అంచనాలు.. వార్తలు అన్నిఇన్ని కావు. ఎప్పటికప్పుడు రజనీ రాజకీయ అరంగేట్రం చేస్తున్నారంటూ వార్తలు రావటం.. ఆ తర్వాత కరెక్షన్ చేసుకోవటం మామూలుగా మారింది. మొన్నామధ్య రజనీ సతీమణి స్వయంగా తన భర్త రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించారు. ఇక.. రజనీ సోదరుడు సంగతి అయితే చెప్పాల్సిన అవసరం లేదు.
ఇదిలా ఉంటే.. తనకు రాజకీయాల్లోకి వచ్చే ఆసక్తి లేదంటూ ఈ మధ్యనే ప్రకటించిన రజనీ మాటలకు భిన్నంగా ఆయన సోదరుడు మరో ఆసక్తికర అంశాన్ని వెల్లడించారు. తన సోదరుడు రజనీకాంత్ రాజకీయాల్లోకి రావటం ఖాయమని.. వచ్చే ఏడాది మొదట్లో ఆయన రాజకీయపార్టీ పెట్టటం పక్కా అని చెబుతున్నారు. తమిళనాడు రాజకీయాల్లో డీఎంకే.. అన్నాడీఎంకే తప్పించి బలమైన రాజకీయ పార్టీలు నేపథ్యంలో రజనీ రూపంలో ఒక పెద్ద మార్పు వస్తుందన్న అంచనా ఎప్పటి నుంచో ఉన్నదే.
అయితే.. తన పొలిటికల్ ఎంట్రీపై మొదటి నుంచి సూటిగా స్పందించని రజనీకాంత్ ఈ మధ్యలో పాలిటిక్స్ లోకి వచ్చేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లుగా కనిపించింది. నర్మగర్భ వ్యాఖ్యలు కూడా చేశారు. అంతలో ఏమైందో కానీ.. తనకు రాజకీయాల్లోకి రావాలన్న ఆసక్తి లేదన్న మాటను చెప్పారు. దీంతో.. రజనీ రాజకీయాల మీద కథ ముగిసినట్లుగా భావించారు.
ఇదిలా ఉండగా.. తాజాగా రజనీ సోదరుడు మరోసారి ఆసక్తికర వ్యాఖ్య చేశారు. వచ్చే ఏడాది జనవరిలో తన రాజకీయ రంగప్రవేశం మీద ప్రకటన చేయటంతో పాటు.. పార్టీని కూడా రజనీకాంత్ ప్రకటిస్తారని చెప్పారు. రజనీ సోదరుడే పార్టీ ముచ్చట చెప్పిన నేపథ్యంలో రజనీ ఈ అంశంపై ఎలా రియాక్ట్ అవుతారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.