Begin typing your search above and press return to search.
రెండు సంతకాలకు రూ.300 కోట్లు వస్తాయని చెప్పారట
By: Tupaki Desk | 23 Oct 2021 5:30 AM GMTదేశంలో చాలామంది గవర్నర్లు ఉన్నారు. కానీ.. తాజాగా మేఘాలయ గవర్నర్ గా వ్యవహరిస్తున్న సత్యపాల్ మాలిక్ మాత్రం తరచూ వార్తల్లో నిలుస్తుంటారు. ఏదో ఒక అంశంలో ఆయన పేరు వినిపిస్తూ ఉంటుంది. తాజాగా ఆయన నోటి నుంచి వచ్చిన వ్యాఖ్యలు రాజకీయ రగడకు తెర తీసేలా ఉందన్న మాట వినిపిస్తోంది. గతంలో జమ్ముకశ్మీర్ కు గవర్నర్ గా వ్యవహరించిన ఆయన.. తాజాగా నాటి సంగతుల్ని చెప్పారు. ఈ సందర్భంగా సంచలన నిజాన్ని ఆయన నోటి నుంచి బయటకు వచ్చింది.
తాను జమ్ము కశ్మీర్ రాష్ట్రానికి గవర్నర్ గా వ్యవహరిస్తున్నప్పుడు తన టేబుల్ మీదకు రెండు ఫైళ్లు వచ్చాయని.. అవి దేశంలోనే ప్రముఖ పారిశ్రామికవేత్త.. సంఘ్ పరివార్ తో అనుబంధం ఉన్న వ్యక్తికి చెందిన రెండు సంస్థలని చెప్పారు. కాకపోతే.. అందులో ఏదో మతలబు ఉందని తనకు తెలిసిందన్నారు. అయితే.. ఆ రెండు ఫైళ్లను క్లియర్ చేస్తే రూ.300 కోట్లు ఇస్తామని ఆఫర్ చేశారన్నారు. రెండు సంతకాలకు రూ.300కోట్లు ఇస్తామన్న ఆఫర్ ను తన సెక్రటరీ చెప్పారని.. తాను మాత్రం ఆ ఫైళ్లను రిజెక్టు చేసినట్లు చెప్పారు. తన జీవితంలో అవినీతి పనులు చేయలేదన్నారు.
తనకు వచ్చిన డీల్ గురించి ప్రధానమంత్రి మోడీకి తెలిపినట్లు చెప్పారు. తాను ఫైళ్లను రిజెక్టు చేసినందుకు ఒత్తిళ్లు వస్తాయని కొందరు చెబితే.. గవర్నర్ పదవి నుంచి తప్పుకోవటానికైనా తాను సిద్ధమని చెప్పినట్లు చెప్పారు. ప్రధాని మోడీ తన నిర్ణయాన్ని సమర్థించినట్లు వెల్లడించారు. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. 2018 ఆగస్టు 21న జమ్మూకశ్మీర్ గవర్నర్ గా వ్యవహరిస్తే.. ఏడాది తర్వాత ఆయన్ను గోవాకు బదిలీ చేశారు. ప్రస్తుతం ఆయన మేఘాలయ గవర్నర్ గా పని చేస్తున్నారు. గవర్నర్ కే ఆఫర్ ఇచ్చిన ఆ బడా కంపెనీ ఏమిటో బయటకు చెబితే బాగుండేది కదా సత్యపాల్ జీ?