Begin typing your search above and press return to search.
మిస్సైల్ దాడులతో సౌదీ షాక్!
By: Tupaki Desk | 25 Jun 2018 9:41 AM GMTఊహించని అంతర్జాతీయ పరిణామం ఒకటి చోటు చేసుకుంది. ఆదివారం అర్థరాత్రి మిస్సైల్ దాడులతో సౌదీ అరేబియా వణికింది. యుద్ధభయం ఎలా ఉంటుందన్న అనుభవం ఈ మధ్య కాలంలో లేని వారికి.. ఆకాశంలో సాగిన మిస్సైల్ వార్.. అక్కడి ప్రజల్ని భయాందోళనలకు గురి చేసింది. సౌదీకి పొరుగున ఉన్న యెమన్ నుంచి బాలిస్టిక్ మిస్సైళ్లు ప్రయోగించటంతో సౌదీ ప్రజలకు షాకింగ్ గా మారింది.
అయితే.. ఈ దాడిని సౌదీ ఎయిర్ ఫోర్స్ ఆకాశంలోనే అడ్డుకొని.. వాటిని తునాతనకలు చేయటంతో భారీ ప్రాణ.. ఆస్తి నష్టం చోటు చేసుకోలేదు. అయితే.. జరుగుతున్నదేమిటో అర్థం కాని సౌదీ ప్రజలు మాత్రం ఏం జరుగుతుందోనన్న భయాందోళనలకు గురయ్యారు.
హౌతీ రెబల్స్ వర్గం ఆదివారం అర్థరాత్రి రియాద్ నగరంపై రెండు బాలిస్టిక్ మిస్సైళ్లను ప్రయోగించిందని.. అయితే.. సైన్యం ఆ దాడిని సమర్థంగా తిప్పి కొట్టినట్లుగా సౌదీ అధికారిక టీవీ ఛానల్ అల్ ఎఖాబారియా వార్తల్నిప్రసారం చేసింది. ఇదిలా ఉండగా.. తాజా దాడి కారణంగా ఎలాంటి నష్టం వాటిల్లలేదని చెబుతున్నా.. తీవ్రత ఎంతోకొంత ఉంటుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఇదిలా ఉండగా.. ఏఎఫ్‌పీ జర్నలిస్ట్ మాత్రం నాలుగు భారీ పేలుళ్ల శబ్దాన్ని విన్నట్లుగా చెబుతున్నారు. దీనికి భిన్నంగా అక్కడి స్థానికులు మాత్రం పేలుళ్ల సంఖ్య ఎక్కువనే చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. రియాద్ సైన్యం తమ మిస్సైళ్లను కూల్చలేదని.. అవి గమ్యస్థానాన్ని చేరుకోలేకపోయినట్లుగా పేర్కొన్నారు. తాజా పరిణామాలతో సౌదీలో ఏం జరుగుతుందన్న సందేహం పలువురిని పట్టి పీడిస్తోంది.