Begin typing your search above and press return to search.

ఇక ఎన్నిరోజులుంటే అంతే డబ్బు చెల్లించవచ్చు..: సౌదీ అరేబియా కొత్త పాలసీ..

By:  Tupaki Desk   |   7 Nov 2021 8:30 AM GMT
ఇక ఎన్నిరోజులుంటే అంతే డబ్బు చెల్లించవచ్చు..: సౌదీ అరేబియా కొత్త పాలసీ..
X
ప్రవాసీయులకు సౌలభ్యానికి సౌదీ అరెబియా కొత్త పాలసీ తీసుకొచ్చింది. వలసదారులు తాను నివాసం ఉండేందుకు భారీగా వెచ్చించాల్సిన అవసరం ఉండేది. అంతేకాకుండా కొన్ని రోజుల పాటు అవసరముంటే ఏడాది మొత్తం రెసిడెన్సీ ఫీజు చెల్లించాల్సి వచ్చేది. అయితే తాజాగా తీసుకొచ్చిన కొత్త విధానంతో ఇక్కడికి వచ్చిన వారు ఎన్నిరోజులు కావాలంటే అన్నిరోజులకు మాత్రమే రెసిడెన్సీ ఫీజులు చెల్లించాలి. దీంతో డబ్బు ఆదా కావడమే కాకుండా వృథా కాకుండా ఉంటుంది. అందుకు సంబంధించిన ఆదేశాలను కూడా జారీ చేసంది. దీంతో మూడు, ఆరు నెలల కాలపరిమతితో రెసిడెన్సీయల్ పర్మిట్ తీసుకొని ఎంత వరకు అవసరముంటే అన్ని రోజులు మాత్రమే డబ్బలు చెల్లించవచ్చు.

ప్రస్తుతం వర్క్ పర్మిట్ల రెన్యువల్ కోసం యజమానులు ప్రవాస రుసుము కింద నెలకు 800 సౌది రియాల్, సంవత్సరానికి 9,600 చెల్లిస్తున్నారు. డిపెండెంట్ కలిగి ఉన్న ప్రవాసీయులు ప్రతి డిపెండెంట్ కు 400 సౌదీ రియాల్ చెల్లిస్తున్నారు. తాజాదా సౌదీ ప్రభుత్వం వలస దారుల కోసం మూడు నెలలు, ఆరు నెలల కాలపరిమితితో పర్మిట్లను జారీ చేస్తారు. అంతేకాకుండా వర్క్ పర్మిట్లు తీసుకున్న డిజిటల్ కాపీని కూడా అందిస్తారు. ఈ మేరకు సౌదీ అరేబియా దేశ అంతర్గత వ్యవహారాల మంత్రి ప్రిన్స్ అబ్దుల్ అజీజ్ బిన్ సౌద్ బిన్ నైఫ్ ఈ విధానాన్ని ప్రకటించారు.

షార్ట్ టర్మ్ రెసిడెన్సీ పాలసీతో వలసదారులకు లాభం చేకూరనుంది. ఎవరైనా యజమానులు రెసిడెన్సీ పర్మిట్ గడువు ముగియబోతున్న ప్రవాసీయులను నియమించుకొని దానిని మరోమూడు నెలల పాటు పునరుద్దరించుకోవచ్చు. అయితే అంతకుముందు ఇది సంవత్సరం పాటు రెన్యూవల్ చేసుకోవాల్సి వచ్చేంది. కానీ తాజా ఉత్తర్వులతో మూడు లేదా ఆరు నెలలు మాత్రమే గడువు పెంచారు. ఇక ప్రవాసుల గడువు ముగిసినా కొన్ని నెలలపాటు దేశంలోనే ఉండాల్సిన అవసరం ఏర్పడినప్పుడు దానిని అంతేకాలానికి పునరుద్దరించుకోవచ్చు.

ఈ విధానం ప్రవేశపెట్టడంతో వలసదారులు చాలా హ్యాపీగా ఫీలవుతున్నారు. గతంలో సంవత్సరం పాటు రెన్యువల్ తీసుకొని అనవసరంగా డబ్బు చెల్లించాల్సి వచ్చేదని, తాజా విధానంతో డబ్బు ఆదా అవతుందని అంటున్నారు. ఇలా తక్కువ గడువు విధించడం వల్ల ఫీజు భారం కూడా తక్కువే అవుతుంది. దీంతో తమకు డబ్బు ఆదా అవుతుందని ప్రవాసీయులు పేర్కొంటున్నారు. కాగా షార్ట్ టర్మ్ రెసిడెన్సీ పర్మిట్లను ప్రజలకు అందుబాటులోకి తెచ్చామని ఆ దేశ అధికారులు తెలుపుతున్నారు. వివిధ దేశాలతో పాటు భారత్ నుంచి సౌదీ అరెబియా వెళ్లిన వారు చాలా మందే ఉన్నారు. వారిలో కొందరు ఉపాధి, ఉద్యోగం కోసం కొన్ని నెలల పాటు ఉండి తిరిగి స్వదేశానికి వచ్చేవారున్నారు. ఇక తాజాగా ప్రవేశపెట్టిన విధానంతో తమకు మేలే జరుగుతుందని అంటున్నారు.