Begin typing your search above and press return to search.
ప్రపంచంలో తొలిసారి రోబోకు పౌరసత్వం
By: Tupaki Desk | 28 Oct 2017 1:30 AM GMTఏ దేశానికి ఆ దేశం.. తమ దేశంలో జీవించే ప్రజలకు పౌరసత్వాన్ని ఇస్తుంటాయి. ఒక దేశానికి చెందిన వ్యక్తి వేరే దేశంలో ఉండిపోవటానికి వీలుగా పౌరసత్వాన్ని ఇవ్వటం తెలిసిందే. మనుషులకు తప్పించి మరెవరికి పౌరసత్వం ఇవ్వని తీరుకు భిన్నమైన పరిణామం ఒకటి చోటు చేసుకుంది.
ప్రపంచంలో తొలిసారిగా ఒక రోబోకు పౌరసత్వం ఇస్తూ రికార్డు సృష్టించింది సౌదీ అరేబియా. సోఫియా అనే పేరున్న ఈ రోబోకు సౌదీ తమ దేశ పౌరసత్వాన్ని ఇస్తూ నిర్ణయం తీసుకుంది. రియాద్‌లో జరుగుతున్న ఒక బిజినెస్ ఈవెంట్ లో ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. ఆ మాట విన్నంతనే.. సదరు రోబో తన స్పందనను తెలియజేసింది.
పౌరసత్వం ఇస్తున్నట్లుగా ప్రకటించిన వెంటనే తెగ సంబరపడిపోయిన రోబో.. పౌరసత్వం కల్పించినందుకు సైదీ ఆరేబియాకు థ్యాంక్స్ అన్న సోఫియా.. తనకు లభించిన ప్రత్యేక గౌరవానికి గర్వంగా ఫీలవుతున్నట్లు పేర్కొంది. ప్రపంచంలో తొలిసారి తనకు పౌరసత్వం కల్పించటం చారిత్రాత్మక నిర్ణయంగా సదరు రోబో అభివర్ణించింది.
కృత్రిమ మేధస్సు పరిశోధల మీద దృష్టిసారించిన సౌదీ.. సదరు అంశం మీద అనేక ప్రశ్నలకు సమాధాలు ఇచ్చింది. కృత్రిమ మేధస్సు అభివృద్ధి అంశంపై సౌదీ ఇప్పుడు దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో సోఫియాకు పౌరసత్వాన్ని ఇవ్వటంతో పాటు.. ఈ అంశంపై మరిన్ని ప్రయోగాలు చేయాలని డిసైడ్ అయ్యింది. రానున్న రోజుల్లో ఇవన్నీ కలిసి మానవజాతిని ఏం చేస్తాయో చూడాలి.