Begin typing your search above and press return to search.

మా దేశానికి రండి.. కానీ ఆ పనులు మాత్రం చేయకండి

By:  Tupaki Desk   |   30 Sep 2019 5:04 AM GMT
మా దేశానికి రండి.. కానీ ఆ పనులు మాత్రం చేయకండి
X
దేశం ఏదైనా టూరిజాన్ని డెవలప్ అయ్యేందుకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నాయి. ప్రపంచంలోని కొన్ని దేశాలైతే.. తమ దేశానికి వచ్చే పర్యాటకుల కారణంగానే బండి లాగిస్తున్న దేశాలు లేకపోలేదు. పరిమితులు ఎక్కువగా ఉండే సౌదీ అరేబియాలో తొలిసారి టూరిస్ట్ వీసాలు జారీ చేస్తున్న సంగతి తెలిసిందే.

ప్రపంచంలోని 49 దేశాలకు చెందిన పౌరులు సౌదీకి చేరుకున్నంతనే ఈ-వీసాలు (వీసా ఆన్ అరైవల్) ఇచ్చే నిర్ణయాన్ని తీసుకుంది. దీంతో.. సౌదీకి పర్యాటకుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందంటున్నారు. అయితే.. టూరిస్ట్ వీసాల్ని తొలిసారి ఇస్తున్న సౌదీ.. ఆసక్తికర ప్రకటన చేసింది.

తమ దేశానికి పర్యాటకులు రావాలని చెబుతూనే.. అందుకు కొన్ని కండీషన్లు ఉన్నాయని పేర్కొంది. తమ దేశానికి పర్యాటకులుగా వచ్చే వారు బిగుతుగా ఉండే దుస్తులు వేసుకోకూడదన్న కండిషన్ పెట్టింది. అంతేకాదు.. బహిరంగంగా ముద్దులు పెట్టుకోవటాన్ని నిషేధించింది. బిగుతు దుస్తులు.. బహిరంగ ముద్దులు లాంటి వాటిని నిషేధిస్తున్నాం. ఇందుకు భిన్నంగా ఎవరైనా వ్యవహరిస్తే భారీ ఫైన్లు తప్పవని ప్రకటించింది. తొలిసారి టూరిస్ట్ వీసాలు జారీ చేస్తున్న వేళలో.. తమ దేశానికి వచ్చే వారికి సంబంధించి కొన్ని నిబంధనల్ని తయారు చేసింది. దేశానికి రమ్మంటూనే.. ఇలా కండీషన్లు పెట్టటంపై పర్యాటకులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.