Begin typing your search above and press return to search.
ఆదేశంలో యుద్ధం... మన పల్లెలకు కూడా ఎఫెక్టే!
By: Tupaki Desk | 15 Oct 2018 6:04 PM GMTఏ గొడవా లేకుండానే మనదేశంలో పెట్రోల్ వంద వైపు పరుగులు తీస్తున్న తీరు సామాన్యులను తీవ్రంగా ఆందోళనకు గురిచేస్తున్న సంగతి తెలిసిందే. పెరగడమే తప్ప తరగడం తెలియదు అన్నట్లుగా ఉన్న పెట్రో రేట్ల జాబితాలో తాజాగా మరో షాక్ వచ్చిచేరింది. అదే ప్రస్తుతం అమెరికా - సౌదీఅరేబియా మధ్య మాటల యుద్ధం నడుస్తున్న ఒకవేళ దారిమళ్లితే అది మన నెత్తికి చుట్టుకోనుండటమే. ఈ యుద్ధం సౌదీ చమురుమంత్రం ప్రయోగిస్తే అంతే సంగతులని అది ప్రత్యక్షంగా భారత్ పై పడుతుందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వివరాల్లోకి వెళితే...జమాల్ ఖషోగ్గీ అనే సౌదీ జర్నలిస్టు టర్కీలో హత్యకు గురయ్యాడు. సౌదీ రాయబార కార్యాలయం సందర్శించిన తర్వాత హత్యకు గురయ్యాడు. సౌదీ ప్రభుత్వమే ఈ హత్య చేయించిందని మీడియాలో కుప్పతెప్పలుగా కథనాలు వస్తున్నాయి. అమెరికా మీడియాలో గగ్గోలు ఎక్కువైంది. దాంతో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సౌదీని ఓ మోస్తరుగా బెదిరించారు. ఆంక్షల ప్రస్తావన తెచ్చారు. దీంతో సౌదీ కొంచెం గట్టిగానే సమాధానమిచ్చింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మాకూ ప్రభావయుతమైన కీలకపాత్ర ఉంది అంటూ సౌదీ చమురుమంత్రి ఖాలిద్ అల్-ఫాలీ హెచ్చరించారు. అయితే, ఆయన నోటి నుంచి ఈ మాటలు వచ్చాయో లేదో చమురు ధర అలా పెరిగిపోయింది. అసలే ఇరాన్‌పై అమెరికా ఆంక్షలతో ప్రపంచంలో చమురు సరఫరా ఇబ్బందుల్లో పడింది. ఇక సౌదీ ఏదైనా చమురు సంక్షోభానికి తెరతీస్తే ప్రపంచం, ముఖ్యంగా ఆసియా కుదేలు కాకతప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
గతంలో జరిగిన పలు ఉదంతాలను ఈ సందర్భంగా పేర్కొంటున్నారు. 1973-74లో ఇజ్రేల్ యుద్ధం సమయంలో సౌదీ ఒకసారి అలాంటి పనే చేసింది. అప్పట్లో చమురు వాడకం తక్కువ. కానీ ఇప్పుడు చమురు లేనిది పూటగడవని పరిస్థితి. ఖషోగ్గీ హత్యతో సంబంధం లేదని సౌదీ అంటున్న మాటలు నమ్మదగ్గవిగా లేవని అమెరికా ప్రభుత్వం భావిస్తోంది. ప్రజలమెప్పు కోసమైనా ఏదో ఒకటి చేయాలి. నిజంగా తీవ్రస్థాయి కాకపోయినా ఓ మోస్తరు చర్య అయినా తీసుకోవాలి. అమెరికాలోని సౌదీ దౌత్యాధికారులను తగ్గించడం లేదా ఉమ్మడి కార్యక్రమాలను వాయిదా వేయడం వంటి చర్యలు అమెరికా తీసుకోవచ్చని భావిస్తున్నారు. నిజంగా సౌదీ రెచ్చిపోయి చమురుతో గేమ్‌లు ఆడడం మొదలుపెడితే అది భారీ స్థాయిలో ప్రభావం చూపడం ఖాయమంటున్నారు.