Begin typing your search above and press return to search.
భార్య తనకంటే వేగంగా నడిచినందుకు విడాకులు!
By: Tupaki Desk | 22 Aug 2017 10:02 AM GMTగుట్టుగా సాగాల్సిన సంసారాలు రోడ్డెక్కడం - విడాకుల కోసం పట్టుబడే ఎపిసోడ్ లో భాగంగా ఎన్నో ఇబ్బందికరమైన సంఘటనలు గతంలో మనం విన్నాం - చూశాం! వరకట్న వేధింపులు - గృహహింస చట్టం కింద విడాకులు ఇవ్వడం చూశాం.. కానీ భార్య వేగంగా నడిచిందని.. తలకాయ కూర వడ్డించలేదని.. హనీమూన్ లో కాళ్ల గొలుసులు ధరించలేదని తమ భార్యలకు భర్తలు విడాకులిచ్చారు. వినడానికి వింతగా ఉన్నప్పటికీ ఇవన్నీ నిజం. ఇవన్నీ ఎక్కడ జరిగాయంటే...ప్రపంచ కఠిన చట్టాలకు కేరాఫ్ అడ్రస్ - మహిళలకు స్వేచ్ఛ లేదని ప్రజాస్వామిక వాదులు ఆరోపించే గల్ఫ్ దేశాల్లో జరిగాయి.
సామాజిక కార్యకర్తల వివరాల ప్రకరాం...దుబాయికి చెందిన దంపతులిద్దరూ వాకింగ్ చేస్తుండగా భర్త కంటే వేగంగా భార్య నడిచింది. ఈ విషయంలో భార్యను పలుమార్లు భర్త హెచ్చరించాడు! తనతో పాటే నడవాలని చెప్పినప్పటికీ భార్య పట్టించుకోకపోవడంతో.. చివరకు ఆవిడకు భర్త విడాకులిచ్చేశాడు. ఇంకో ఘటన చూస్తే.. ఆశ్చర్యమేస్తుంది. విందుకు తలకాయ కూర వడ్డించలేదని మరో భర్త తన భార్యకు విడాకులిచ్చాడు. ఇది కూడా సౌదీలోనే. భర్త స్నేహితులకు తలకాయ కూర వడ్డించడం మరిచిపోవడంతోనే విడాకులిచ్చినట్లు బాధితురాలు పేర్కొంది. ఆయన స్నేహితులు ఇంటి నుంచి వెళ్లిపోయిన వెంబడే.. తనపై కోపంతో ఊగిపోయారని భార్య ఆవేదన వ్యక్తం చేసింది.
మరో ఘటన చూస్తే.. పడిపడి నవ్వాలనిపిస్తది. హనీమూన్ కు వెళ్లిన సమయంలో కాళ్ల గొలుసులు ధరించలేదని తన భార్యకు భర్త విడాకులిచ్చేశాడు. ఇది కూడా సౌదీలోనే చోటు చేసుకుంది. చిన్న చిన్న కారణాలకు విడాకులివ్వడం సరియైంది కాదని సామాజిక కార్యకర్తలు చెబుతున్నారు. ఈ దోరణి మారకపోతే ఏదో ఒక రోజు మహిళా లోకం నుంచి ప్రతిఘటన రావడం ఖాయమని కూడా వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.