Begin typing your search above and press return to search.
భార్యకు కాన్పు చేసిన డాక్టర్ పై కాల్పులు
By: Tupaki Desk | 27 May 2016 9:44 AM GMTమూర్ఖత్వం పరాకాష్టకు చేరితే ఎలా ఉంటుందనేందుకు ఇదే ఉదాహరణ. ఆపత్కాలంలో వైద్యం చేసి ప్రాణాలు రక్షించిన వైద్యుడిపైనే సదరు భర్త హత్యాయత్నం చేశాడు. తన భార్యకు కాన్పు చేసినందుకు వైద్యుడికి మరణం బహుమతిగా ఇవ్వజూసిన ఈ మూర్ఖపు భర్త ఘటన సౌదీ లో చోటుచేసుకుంది.
రియాద్ లో కింగ్ ఫహాద్ ఆసుపత్రికి గర్భిణిగా ఉన్న ఓ మహిళ వచ్చింది. ఆమెను పరీక్షించిన వైద్యులు ఆపరేషన్ చేయడం అత్యవసరం అని తేల్చారు. అయితే మహిళా డాక్టర్లు లేకపోవడం, పైగా ఆ మహిళ నొప్పులతో బాధపడుతున్న నేపథ్యంలో పురుష డాక్టర్ తోనే కాన్పు చేయించారు. ఈ విషయంలో ఆమె భర్తకు డాక్టర్లు తెలిపే చేశారు. అయితే ఈ ఎపిసోడ్ పై ద్వేషం పెంచుకున్న భర్త వైద్యుడిని టార్గెట్ చేశాడు.
తన భార్యకు కాన్పు చేసి బిడ్డకు ప్రాణం పోసిన వైద్యుడికి కృతజ్ఞతలు తెలపాలని చెప్పి ఆస్పత్రికి వచ్చి అనుమతి తీసుకున్నాడు. ఆస్పత్రి ఆవరణలో ఇద్దరు సంభాషణలు కొనసాగుతుండగానే మహిళా గైనకాలజిస్టుతో తన భార్యకు కాన్పు ఎందుకు చేపించలేదని ఆగ్రహిస్తూ సదరు వ్యక్తి తన వెంట తీసుకువచ్చిన తుపాకీని తీసి ఒక్కసారిగా వైద్యుడిపై కాల్పులు జరిపాడు. కాల్పుల శబ్దం విన్న ఆస్పత్రి సిబ్బంది హుటాహుటిన డాక్టర్ ను చికిత్స నిమిత్తం తరలించారు. ఈ క్రమంలోనే కాల్పులు జరిపిన వ్యక్తి అక్కడినుంచి పారిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టుచేసి దర్యాప్తు చేపట్టారు. కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డ వైద్యుడు ఆస్పత్రిలో కోలుకుంటున్నాడు.