Begin typing your search above and press return to search.

యువ‌రాజుకు కూడా కొర‌డా దెబ్బలు త‌ప్ప‌లేదు

By:  Tupaki Desk   |   2 Nov 2016 3:40 PM GMT
యువ‌రాజుకు కూడా కొర‌డా దెబ్బలు త‌ప్ప‌లేదు
X
శిక్షలు విధించ‌డం అంటే కేరాఫ్ అడ్ర‌స్ పేరు అర‌బ్ కంట్రీలు అనేది తెలిసిన విష‌యమే. కఠిన శిక్ష‌ణ‌ల్లో పేరొందిన సౌదీలో ఓ యువ‌రాజుకు మ‌ర‌ణ‌శిక్ష విధించి నెల రోజులు కూడా కాలేదు. అప్పుడే మ‌రో యువ‌రాజుకు సౌదీ కోర్టు కొర‌డా దెబ్బ‌లు తినాల్సి వ‌చ్చింది. అధికార అల్ సౌద్ కుటుంబానికి చెందిన ఓ యువ‌రాజుకు జెడ్డా జైలులో కొర‌ఢా దెబ్బ‌ల శిక్ష‌ను అమలు చేశారు. అయితే అత‌ని పేరు ఏంటి? అత‌డు చేసిన నేరం ఏంట‌న్న వివ‌రాలు మాత్రం బ‌య‌ట‌కు రాలేదు. ఆ యువ‌రాజు కొర‌ఢా దెబ్బ‌ల‌తో పాటు జైలు శిక్ష కూడా అనుభ‌వించ‌నున్న‌ట్లు ఒకాజ్ అనే ప‌త్రిక వెల్ల‌డించింది.

ఆ ప‌త్రిక క‌థ‌నం ప్ర‌కారం జెడ్డా జైలులో ఓ పోలీస్ అధికారి అత‌నికి కొర‌ఢా దెబ్బ‌ల శిక్ష విధించారు. శిక్ష‌కు ముందు యువ‌రాజు ఆరోగ్యంగా ఉన్నారా లేదా అని నిర్ధారించుకోవ‌డానికి ఆరోగ్య ప‌రీక్ష‌లు కూడా నిర్వ‌హించారు. అయితే ఈ శిక్ష‌పై ఆ దేశ న్యాయ‌శాఖ అధికార ప్ర‌తినిధి ఇంకా స్పందించ‌లేదు. అర‌బ్ దేశాల్లో ఒక‌టైన సౌదీలో శిక్ష‌లు క‌ఠినంగా ఉంటాయి. అక్క‌డి న్యాయ‌వ్య‌వ‌స్థ కూడా పార‌ద‌ర్శ‌కంగా ప‌నిచేస్తుంది. క‌ఠిన వ‌హాబీ సున్నీ ముస్లిం చ‌ట్టాల‌ను అమలు చేసే ఆ దేశం.. మ‌తాధికారుల‌కు న్యాయ వ్య‌వ‌స్థ‌పై నియంత్ర‌ణ విధించే అధికారం క‌ల్పిస్తుంది. గ‌త నెల 19న కూడా ఇలాగే హ‌త్య ఆరోప‌ణ‌లపై సౌద్ అల్ క‌బీర్ అనే యువ‌రాజుకు మ‌ర‌ణ‌శిక్ష అమ‌లు చేసిన విష‌యం తెలిసిందే. 1970 త‌ర్వాత సౌదీలో ఓ యువ‌రాజుకు మ‌ర‌ణ‌శిక్ష అమ‌లు చేయ‌డం ఇదే తొలిసారి. ఈ శిక్ష‌ల‌పై మ‌రోమారు ప్ర‌పంచ‌వ్యాప్తంగా విస్మ‌యం వ్య‌క్తం అవుతోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/