Begin typing your search above and press return to search.

ఈ స్మగ్లింగ్ ఖర్మేంది యువరాజా?

By:  Tupaki Desk   |   27 Oct 2015 7:25 AM GMT
ఈ స్మగ్లింగ్ ఖర్మేంది యువరాజా?
X
అంతులేని సంపద. అంతకు మించిన అధికారం.. విలాసవంతమైన జీవితం. ఒక మనిషికి ఇంతకు మించి కావాల్సిందేముంది? కానీ.. ఇన్ని ఉన్నా సౌదీ యువరాజు అబ్దెల్ మోసెన్ బిన్ వాలిద్ బిన్ అబ్దులజిజ్ కోరి చిక్కులు కొని తెచ్చుకున్నారు. యువరాజు హోదాను ఎంజాయ్ చేస్తూ.. బుద్దిగా వ్యాపారాలు చేసుకోవటం మానేసి.. డ్రగ్స్ బిజినెస్ లోకి వచ్చి అడ్డంగా బుక్ అయ్యారు.

తాజాగా లెబనాన్ లోని బీరుట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో నిషేధిక డ్రగ్స్ రవాణా చేస్తూ దొరికిపోయారు. ఆయనతో పాటు.. మరో నలుగుర్ని అక్కడి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీరి వద్ద నుంచి భారీగా డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నట్లు చెబుతున్నారు. ఈ డ్రగ్స్ రేంజ్ ఏ స్థాయిలో ఉంటుందంటే.. బీరుట్ విమానాశ్రయ చరిత్రలో పట్టుపడ్డ అతి పెద్ద స్మగ్లింగ్ రాకెట్ గా అభివర్ణిస్తున్నారు.

మనో ఉద్దీపన పెంచే మాత్రల్ని పెద్ద ఎత్తున సరఫరా చేస్తూ ఎయిర్ పోర్ట్ లో దొరికిపోయారు. ఈ నిషేధిత డ్రగ్ వినియోగంపై సరఫరాపై ఆంక్షలు ఉన్నాయి. అయినప్పటికీ అవేమీ పట్టించుకోని సౌదీ యువరాజు ప్రైవేటు విమానంలో ఎంచక్కా నిషేధిక డ్రగ్స్ ను బీరుట్ నుంచి సౌదీ అరేబియాకు తరలిస్తుండగా పట్టుకున్నారు. రాజు వంశంలో పుట్టి కూడా ఈ చిల్లర పనులేంటో..?