Begin typing your search above and press return to search.
కశ్మీర్ ఎఫెక్ట్: పాకిస్తాన్ కు సౌదీ షాక్
By: Tupaki Desk | 13 Aug 2020 12:30 AM GMTముస్లిం దేశాలన్నీ ఒక్క కూటమిగా ఉంటాయి. పాకిస్తాన్ లాంటి ముస్లిం కంట్రీకి గల్ఫ్ దేశాలు పెద్ద ఎత్తున రుణాలు ఇస్తూ.. చమురు సరఫరా చేస్తూ తమ సొంత కంట్రీగా భవిస్తుంటాయి.అయితే ఇప్పుడు ఆ పరిస్థితులు మారాయి.
కశ్మీర్ విషయంలో తమపై ఒత్తిడి తెస్తున్న పాకిస్తాన్ కు సౌదీ అరేబియా గట్టి బుద్ది చెప్పింది. పాకిస్తాన్ కు ఇకపై రుణాలు ఇవ్వబోమని.. ఆ దేశానికి చమురు సరఫరాను కూడా నిలిపివేస్తున్నట్టుగా సౌదీ అరేబియా ప్రకటించింది.
గతంలో పాకిస్తాన్ కు ఇచ్చిన దాదాపు రూ.7500 కోట్ల రుణాన్ని కూడా సౌదీ వెనక్కు తీసుకొని గట్టి షాక్ ఇచ్చింది.
కశ్మీర్ విషయంలో భారత్ కు వ్యతిరేకంగా సౌదీ బలమైన నిర్ణయాన్ని తీసుకోవాలని పాకిస్తాన్ కొద్దిరోజులుగా సౌదీపై ఒత్తిడి తెస్తోంది. ఈ నేపథ్యంలోనే సౌదీ ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో రెండు దేశాల మధ్య ఉన్న స్నేహానికి ముగింపు పడింది.