Begin typing your search above and press return to search.
తబ్లీగీ జమాత్ కు షాక్ ఇచ్చిన సౌదీ.. సంస్థపై నిషేధం
By: Tupaki Desk | 13 Dec 2021 12:30 AM GMTతబ్లీగీ జమాత్.. దేశంలో కరోనా వచ్చిన తొలినాళ్లలో మారు మోగి పోయిన పేరు ఇది. మరో సారి వార్తల్లో నిలిచింది ఈ ఇస్లామిక్ సంస్థ. ఇందుకు కారణం ప్రముఖ ముస్లిం దేశాల్లో ఒకటైన సౌదీ అరేబియా దీనిపై నిషేదం విధించడమే. ఈ సంస్థతో ప్రపంచానికి తీవ్ర ముప్పు ఉందని సౌదీ భావించింది.దీంతో తబ్లీగీ జమాత్ పై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది. నిషేధం విధించిన విషయాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న చాలా ముస్లిం దేశాలకు తెలపాలని భావిస్తుంది. ఇప్పటికే ఈ సంస్థకు సంబంధించిన కార్యకలాపలకు ముస్లింలు ఎవరూ వెళ్లకూడదని సౌదీ స్పష్టం చేసింది.
ఈ సంస్థ 1926లో ప్రారంభమైంది. ఈ సంస్థకు ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల ముస్లింలతో సంబంధాలు ఉన్నాయి. అంతేగాకుండా పలు ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నట్లు ఆరోపణలు కూడా అన్నాయి. ఈ నేపథ్యంలో ఈ సంస్థపై నిషేధం విధించినట్లు సౌదీ అరేబియా అధికారులు తెలిపారు. అంతేగాకుండా ఈ సంస్థ నిర్వహించే ఎటువంటి సభలకు ముస్లింలు వెళ్లకూడదని అధికారులు ఈ నిషేధ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దీనితో పాటు తమ దేశంలో ముస్లింలు తబ్లీగీ జమాత్ ను అనుసరించినట్లు అయితే కఠిన చర్యలు తీసుకుంటమని వారు స్పష్టం చేశారు. ఈ నిషేధాజ్ఞలు ఎప్పటివరకు కొనసాగుతాయనే దానిపే అధికారులు ఎటువంటి సమాచారం ఇవ్వలేదు.
తబ్లీగీ జమాత్ పై నిషేధం విధించడాన్ని కొన్ని ముస్లిం దేశాలు స్వాగతించాయి. మరి కొన్ని దేశాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. సౌదీ అరేబియా అంచనా ప్రకారం ఈ వివిధ దేశాల్లో ఈ సంస్థ మతం పేరుతో ఉగ్రవాదన్ని ప్రోత్సహిస్తుందని అభిప్రాయపడుతున్నారు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా తీవ్రవాదం పేట్రేగి పోతుందని భావించారు. ఈ కారణంగా నిషేధం విధించినట్లు నిపుణులు భావిస్తున్నారు. ఇదే కాని నిజం అయితే తబ్లిగీ జమాత్ కు గట్టి ఎదురు దెబ్బతగినట్లు అని నిపుణులు చెప్తున్నారు.
అన్నీ దేశాల్లో కలిపి ఈ సంస్థకు సుమారు 36కోట్లకు పైగా అనుచరులు ఉన్నట్లు సౌదీ అరేబియా గణాంకాలు చెప్తున్నాయి. వీరంతా ఉగ్రవాదం వైపు మరల కూడదనే ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సౌదీ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. భారత్ లో కరోనా ప్రారంభ దశలో ఉన్నప్పుడు తబ్లీకి జమాత్ ఓ కార్యక్రమాన్ని నిర్వహించింది. దీని కారణంగా వైరస్ వ్యాప్తి ఎక్కువ అయ్యింది అని విమర్శలు వెల్లువెత్తాయి. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున విదేశాల నుంచి వచ్చిన వారు పాల్గొనడమే ఇందుకు కారణమని వార్తలు వినిపించాయి. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వెళ్లిన వారిని ట్రేస్ చేయడం చాలా కష్టమైంది. దీంతో ఆ సభపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది.