Begin typing your search above and press return to search.

మ‌నోళ్ల మీద సౌదీ రాజు ప‌న్ను వేశాడు

By:  Tupaki Desk   |   21 Jun 2017 12:15 PM GMT
మ‌నోళ్ల మీద సౌదీ రాజు ప‌న్ను వేశాడు
X
రాజరికం ఎలా ఉంటుందో చ‌రిత్ర పుస్త‌కాల్లో చ‌దివాం. ఆధునిక యుగంలోనూ కొన్ని దేశాల్లో రాజరికం న‌డుస్తున్న వేళ‌.. ఎలాంటి రూల్స్ చేస్తుంటారో అప్పుడ‌ప్పుడు వార్త‌ల్లో చ‌దువుతుంటాం. తాజాగా సౌదీ రాజు తీసుకున్న నిర్ణ‌యంతో భార‌తీయుల మీద అద‌న‌పు భారం ప‌డ‌నుంది. సౌదీలో నివ‌సించే భార‌తీయుల మీద స‌రికొత్త ప‌న్నును వేసేశాడు సౌదీరాజు. బ‌తుకు తెరువు కోసం గ‌ల్ఫ్ దేశాల‌కు మ‌నోళ్లు వెళ్ల‌టం కాస్త ఎక్కువే. మ‌నోళ్ల‌ను టార్గెట్ చేసిన‌ట్లుగా తాజా ప‌న్ను ఉండ‌టం గ‌మ‌నార్హం.

వ‌చ్చే నెల ఒక‌టో తేదీ నుంచి తాజా ప‌న్ను మోత మొద‌లు కానుంద‌ని చెబుతున్నారు. ఒక ప్ర‌ముఖ మీడియా సంస్థ క‌థ‌నం ప్ర‌కారం భార‌తీయుల మీద కుటుంబ ప‌న్ను అమ‌ల్లోకి రానున్న‌ట్లు చెబుతున్నారు. తాజా నిర్ణ‌యం నేప‌థ్యంలో సౌదీలో నివ‌సించే ప్ర‌తి బార‌తీయుడు ప్ర‌తి నెలా 100రియాల్స్‌ ను చెల్లించాల్సి ఉంటుంది. మ‌న కరెన్సీలో దాదాపు రూ.1700ల‌కు స‌మానం. ఈ మొత్తం ఆ దేశంలో నివ‌సించే 41 ల‌క్ష‌ల భార‌తీయులకు వ‌ర్తించ‌నుంది. సౌదీ ప్ర‌భుత్వం తీసుకొచ్చిన నిర్ణ‌యంపై భార‌తీయులు తీవ్ర ఆందోళ‌న‌కు గురి అవుతున్న‌ట్లుగా చెబుతున్నారు. 5వేల రియాల్స్ జీతంగా (సుమారు 80వేల రూపాయిల వ‌ర‌కూ ఉంటుంది) ఉండేలా సౌదీ ప్ర‌భుత్వం వీసా మంజూరు చేస్తుంది. తాజాగా అమ‌ల్లోకి వ‌చ్చిన ఆదేశాల ప్ర‌కారం ఒక్కో కుటుంబం మీద ప్ర‌తి నెల రూ.5100 వ‌ర‌కూ భారం ప‌డ‌నుంది. ఇది కూడా ముగ్గురుకుటుంబ స‌భ్యులున్న కుటుంబ‌మైతే. అదే కుటుంబ స‌భ్యుల సంఖ్య ఎక్కువ‌గా ఉంటే ఈ భారం మ‌రింత పెరుగుతుంది. అయితే. . దీనికి సంబంధించిన స‌మాచారం అధికారికంగా త‌మ‌కు అంద‌లేద‌ని భార‌త విదేశాంగ శాఖ చెబుతోంది. ఒక‌వేళ‌.. ఈ వార్త నిజ‌మైతే.. వ‌ల‌స‌ల మీద ప్ర‌భావం ప‌డుతుంద‌ని చెబుతున్నారు. తాజా ప‌న్ను 2020 వ‌ర‌కూ అమ‌ల్లో ఉండ‌నున్న‌ట్లు చెబుతున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/