Begin typing your search above and press return to search.

గుజరాత్ సీఎంగా రిలయన్సు అల్లుడు

By:  Tupaki Desk   |   2 Aug 2016 8:31 AM GMT
గుజరాత్ సీఎంగా రిలయన్సు అల్లుడు
X
గుజరాత్ సీఎం ఆనంది బెన్ పటేల్ రాజీనామా చేయడం.. దాన్ని బీజేపీ పెద్దలు ఆమోదించడంతో ఆ రాష్ట్రానికి కొత్త సీఎం అవసరమయ్యారు. దీంతో కొత్త సీఎం ఎవరన్న చర్చ జరుగుతోంది. అయితే.. పార్టీ పార్లమెంటరీ సమావేశం తరువాత సీఎం ఎవరన్నది నిర్ణయిస్తారు. ముఖ్యంగా రెండు పేర్లు రేసులో ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఆనంది బెన్ కేబినెట్లో ఆరోగ్య - వైద్య - ఆర్ అండ్ బీ మంత్రిగా ఉన్న నితిన్ భాయ్ పటేల్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. మరో మంత్రి సౌరభ్ పటేల్ కూడా రేసులో ఉన్నారు.

వీరిలో నితిన్ కు పటేల్ వర్గంలో మంచి పట్టుంది. ఇటీవల పటేల్ ఉద్యమ సమయంలో చర్చలు జరిపింది ఈయనే. నాలుగుసార్లు గా ఎమ్మెల్యేగా గెలుస్తున్నారు.

మరోవైపు సౌరభ్ కూడా రేసులో ముందున్నారు. ఈయన రిలయన్సు కుటుంబానికి అల్లుడు. ముకేశ్ - అనిల్ అంబానీలకు బావ. ధీరూభాయ్ అంబానీ అన్న రత్నిక్ భాయ్ అంబానీకి సౌరబ్ పెద్ద అల్లుడు. ముకేశ్ - అనిల్ లు ఇద్దరితోనూ ఈయనకు మంచి సంబంధాలున్నాయి. ఈ నేపథ్యంలో వారి అండతో సౌరభ్ గుజరాత్ ముఖ్యమంత్రి అవుతారని అందరూ అనుకుంటున్నారు.

వీరితో పాటు ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు విజయ్ రూపానీ పేరు కూడా వినిపిస్తున్నా ఆయనకు రాజ్ కోట్ లో తప్ప ఇంకెక్కడా పట్టు లేదు. దీంతో నితిన్ - సౌరభ్ లలో ఎవరో ఒకరికి ఛాన్సు వస్తుందని భావిస్తున్నారు.