Begin typing your search above and press return to search.

సేవ్ ఆర్టీసీ.. కేసీఆర్ ఏం చేయబోతున్నారు?

By:  Tupaki Desk   |   22 Nov 2019 12:12 PM GMT
సేవ్ ఆర్టీసీ.. కేసీఆర్ ఏం చేయబోతున్నారు?
X
48 రోజుల సమ్మెకు ముగింపు పలికినా పాపం ఆర్టీసీ కార్మికుల కష్టాలు మాత్రం తీరడం లేదు. కేసీఆర్, కార్మిక సంఘాల పంతానికి పాపం ఇప్పుడు ఆర్టీసీ కార్మికులు బలైపోతున్నారు.

నిన్ననే ఆర్టీసీ సమ్మెను విరమిస్తున్నట్టు కార్మిక సంఘాలు ప్రకటించాయి. అయితే కార్మిక సంఘాలు సమ్మె విరమించినా కేసీఆర్ సర్కారు మాత్రం విరమించనీయడం లేదు. సమ్మెపై ప్రభుత్వం నుంచి ఎలాంటి సానుకూల స్పందన రాలేదు. దీంతో విధుల్లో చేరుదామని గంపెడాశలతో డిపోలకు వెళ్లిన ఆర్టీసీ కార్మికులకు తీవ్ర నిరాశ ఎదురైంది.

ఆర్టీసీ సమ్మె విషయంలో కార్మికులు పట్టు విడిచినా కేసీఆర్ విడవడం లేదు. దీంతో కార్మికులు మళ్లీ సమ్మెలోకి వెళ్లడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది. నవంబర్ 23న అన్ని బస్ డిపోలలో ‘సేవ్ ఆర్టీసీ’ ర్యాలీలు చేపట్టాలని టీఎస్ ఆర్టీసీ జేఏసీ నిర్ణయించింది.

సమ్మె విరమించిన కార్మికులు కేసీఆర్ ప్రభుత్వ తీరుతో ఆశలు కోల్పోవద్దని జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి పిలుపునిచ్చారు. కేసీఆర్ నిర్ణయం ప్రకటించిన తర్వాతే సమ్మెపై భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామని ఆయన తెలిపారు.

ఇలా కేసీఆర్ పంతానికి ఆర్టీసీ కార్మికులు రెంటికి చెడ్డ రేవడిలా తయారయ్యారు. అటు ఉన్నది పోయే ఉంచుకున్నది పాయే అన్నచందంగా ఆర్టీసీ కార్మికుల పరిస్థితి తయారైంది. సమ్మెతో హక్కులు సాధించుకోలేక.. ఇప్పుడు ఉన్న జాబులు దక్కక కార్మికులు నరకయాతన పడుతున్నారు.సేవ్ ఆర్టీసీ పేరుతో రేపు నిరసన ర్యాలీలకు రెడీ అయ్యారు. దీంతోనైనా కేసీఆర్ మారుతారని భావిస్తున్నారు. మరి కేసీఆర్ ఏం చేస్తారన్నది ఆసక్తిగా మారింది.