Begin typing your search above and press return to search.
మోడీ దుర్యోధనుడు-షా దుశ్శాసనుడు.. టీఎంసీ నేత తీవ్ర వ్యాఖ్యలు
By: Tupaki Desk | 30 Nov 2022 11:19 AM GMTప్రధాన మంత్రి నరేంద్ర మోడీని, కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను రాజకీయ ప్రత్యర్థులు అనేక రూపాల్లో విమర్శిస్తూ ఉంటారు. ఈ విషయాన్ని వారు కూడా ఒప్పుకొంటారు. ఇటీవల హైదరాబాద్ వచ్చిన మోడీ.. టన్నుల కొద్దీ తనను తిడతారంటూ.. చెప్పుకొచ్చారు. అయితే.. తాజాగా పశ్చిమ బెంగాల్ అధికార పార్టీతృణమూల్ కాంగ్రెస్ నాయకురాలు, మహిళా ఎమ్మెల్యే సావిత్రి మిత్రా.. తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
''ప్రధాని నరేంద్ర మోడీ దుర్యోధనుడు.. అమిత్ షా దుశ్వాసనుడు.. మిగిలిన కేంద్ర మంత్రులు అందరూ కౌరవ సంతతి'' అని సావిత్రి సంచలన కామెంట్లు చేశారు. అయితే, ఈ వ్యాఖ్యలు ఆమె పదే పదే చేయడం.. అవి వైరల్‌కావడంతో బీజేపీ తీవ్రంగా స్పందించింది.
ఆమెపై కేసు పెట్టింది. ఆరుగురు బీజేపీ ఎమ్మెల్యేలు కలిసి సావిత్రిపై కేసు పెట్టడంతో పోలీసులు ఎఫ్ ఐఆర్ కూడా నమోదు చేశారు.
ప్రస్తుతం జరుగుతున్న బెంగాల్ అసెంబ్లీ సమావేశాల్లోనూ ఇదే విషయం ప్రధానంగా చర్చకు చేపట్టాలని బీజేపీ సభ్యు పట్టుబట్టారు. అయితే.. స్పీకర్ బిమన్ బందోపాధ్యాయ దీనిని తిరస్కరించారు. ఈ క్రమంలో బీజేపీ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. దేశంలోని ఏ పౌరుడు కూడా ఇలాంటి దారుణ మైన వ్యాఖ్యలు చేయరని బీజేపీ సభ్యులు దుయ్యబట్టారు.
ప్రస్తుతం ఈ విషయం ఆసక్తిగా మారడం ఒక ఎత్తయితే.. ఇప్పటికే.. టీఎంసీ ఎమ్మెల్యే ఒకరు రాష్ట్రపతిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రపతి మొహం చూడబుద్ది కాదన్నారు. ఈ విషయం తీవ్ర దుమారం రేపడంతో సీఎం మమతా బెనర్జీ రాష్ట్రపతికి బహిరంగ క్షమాపణలు చెప్పారు.
ఇక, ఇప్పుడు ప్రధాని, హోం మంత్రి వంటి కీలక నేతలపై ఇదే పార్టీ ఎమ్మెల్యే విరుచుకుపడడం మరింతగా రాజకీయాలను వేడెక్కించింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.