Begin typing your search above and press return to search.
కేసీఆర్ కలకు చెక్ చెబుతూ.. కాంగ్రెస్ సీన్ ఎంతో చెప్పిన మరాఠా యోథుడు
By: Tupaki Desk | 5 April 2022 4:30 AM GMTతాము ప్రాతినిధ్యం వహించే రాష్ట్రాల్లో తిరుగులేని అధికారాన్ని సొంతం చేసుకున్నప్పటికీ.. జాతీయ స్థాయిలో చక్రం తిప్పే సత్తా కొందరి నేతలకు మాత్రమే సొంతం. రాష్ట్రంలో బలంగా ఉన్నప్పటికీ జాతీయ రాజకీయాల్లో పెద్దగా ఫేం ఉండని రాజకీయ అధినేతలు ఎందరో కనిపిస్తారు. ఇందుకు భిన్నంగా రాష్ట్రంలో తమకున్న ఇమేజ్ పరిమితమే అయినప్పటికీ.. జాతీయ రాజకీయాల్లో మత్రం కీలకభూమిక పోషించటం.. నలుగురిని కలిపి జట్టును తయారు చేసే సత్తా ఉన్న అధినేతల్లో ఎన్సీపీ అధినేత.. ఒకప్పటి కాంగ్రెస్ పెద్ద తలకాయ.. అన్నింటికి మించిన రాజకీయ మరాఠా యోథుడిగా పేరున్న శరద్ పవార్ తాజాగా కీలక వ్యాఖ్య చేశారు.
జాతీయ స్థాయిలో మూడో కూటమికి కోసం తెగ ట్రై చేస్తున్న కేసీఆర్.. అందులో భాగంగా పలువురితో భేటీ కావటం.. మూడో కూటమిని తెర మీదకు తెచ్చేందుకు తెగ ట్రై చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. కేసీఆర్ కల ప్రాక్టికల్ గా వర్కువుట్ కాదన్న విషయాన్ని తాజాగా తన మాటలతో తేల్చేశారు.
కేసీఆర్ ప్రస్తావన తేలేదు కానీ.. ఆయన కలను తప్పు పట్టేలా ఆయన మాటలు ఉన్నాయి. బీజేపీకి వ్యతిరేకంగా పోరాడి.. ప్రత్యామ్నాయ శక్తిగా మారాలంటే ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్ ను మినహాయించలేమన్నారు.
బీజేపీకి వ్యతిరేకంగా ప్రత్యామ్నాయ కూటమిని బలోపేతం చేసే చర్యలకు తమ సహకారం.. మద్దతు కొనసాగుతుందని స్పష్టం చేసిన పవార్.. అందుకు ఏమేం అవసరమన్న విషయాన్ని ముక్కుసూటిగా చెప్పేశారు. 'కొన్ని నిజాల్ని విస్మరించలేం. టీఎంసీ పశ్చిమ బెంగాల్ లో బలీయమైన శక్తి. అదే విధంగా ఆయా ప్రాంతీయ పార్టీలు కూడా తమ రాష్ట్రాల్లో బలమైన శక్తులే. కానీ.. కాంగ్రెస్ ఇప్పుడు అధికారంలో లేకున్నా.. అఖిల భారత పార్టీ. దేశంలో ఏ మూలకు వెళ్లినా ఆ పార్టీకి కార్యకర్తలు ఉంటారు.బీజేపీపై పోరాటంతో కాంగ్రెస్ పొర్టీ అనివార్యం' అంటూ తేల్చేశారు.
అంతేకాదు.. ఇటీవల కేంద్ర మంత్రి గడ్కరీ మాట్లాడుతూ.. దేశంలో కాంగ్రెస్ బలమైన ప్రతిపక్షంగా ఉండాలన్నఆకాంక్షను వ్యక్తం చేసిన వైనాన్ని ప్రస్తావిస్తూ.. దేశంలో ఒకే పార్టీ బలంగా ఉంటే నాయకులు.. రష్యా అధినేత పుతిన్ లా మారతారన్నారు.
భారత్ కు అలాంటి పుతిన్ బెడద లేదనే తాను భావిస్తున్నట్లుగా పేర్కొన్నారు. మొత్తంగా కాంగ్రెస్ తో సంబంధం లేకుండా మూడో ఫ్రంట్ ఏర్పాటు చేయాలన్న పట్టుదలతో ఉన్న కేసీఆర్ కల కల్లే అన్న వైనాన్ని తన తాజా వ్యాఖ్యతో పవార్ తేల్చేశారని చెప్పకతప్పదు.