Begin typing your search above and press return to search.

ఇక నో మారటోరియం.. ఎకానమీ రికవరీ!

By:  Tupaki Desk   |   12 July 2020 2:30 AM GMT
ఇక నో మారటోరియం.. ఎకానమీ రికవరీ!
X
భారత ఆర్థిక వ్యవస్థ క్రమంగా కోలుకుంటోంది. కరోనా మహమ్మారి వ్యాప్తితో విధించిన లాక్ డౌన్ కారణంగా కుప్పకూలిన ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు పుంజుకుంటోందని ఆర్థిక వేత్తలు చెబుతున్నారు.

జూన్ నెల నుంచి భారత ఆర్థిక వ్యవస్థ కోలుకుంటోందని ఎస్.బీ.ఐ చైర్మన్ రజినీష్ కుమార్ తెలిపారు. ఎస్.బీ.ఐ బ్యాంకింగ్ అండ్ ఎకనామిక్స్ మీట్ లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే కొన్ని రంగాలు పుంజుకోవాలంటే సహకారం అవసరమని స్పష్టం చేశారు.

జూన్ నెల నుంచి భారత ఆర్థిక వ్యవస్థ రికవరీ ప్రారంభమైందని.. మూడు నుంచి నాలుగు నెలల సమయం వేచిచూడాలని ఎస్.బీ.ఐ చైర్మన్ తెలిపారు. కరోనా మహమ్మారి కారణంగా ఏప్రిల్ నెలలో దారుణంగా దెబ్బతిన్నామని.. జూన్ నుంచి రికవరీ ప్రారంభమైందని తెలిపారు. ఊహించిన దానికంటే వేగంగా రికవరీ అవుతోందని తెలిపారు.

కరోనా కారణంగా ఉద్యోగులు, సంస్థలు ఆదాయం కోల్పోవడంతో ఆరు నెలలుగా అమలు చేస్తున్న మారటోరియం వెసులుబాటును పొడిగించాల్సిన అవసరం లేదని ఎస్.బీ.ఐ చైర్మన్ తెలిపారు. ఆగస్టు 31తో ముగుస్తున్న మారటోరియంను ఈ ఏడాది చివరి వరకు పొడగించాల్సిన అవసరం లేదన్నారు. ఎస్.బీ.ఐలో మే చివరి వరకు 20శాతం మంది మాత్రమే మారటోరియం ఉపయోగించుకున్నారని.. మరోసారి పొడిగించడంతో అది మరింతగా పడిపోవచ్చని తెలిపారు. ఇప్పుడు ఆర్థిక వ్యవస్థ కోలుకోవడంతో మారటోరియం అవసరం లేదన్నారు.