Begin typing your search above and press return to search.
ఎస్బీఐ .. ఎన్నికోట్ల డిపాజిట్లంటే!
By: Tupaki Desk | 12 Nov 2016 4:02 AM GMTపాత 500 - 1000 రూపాయల నోట్ల రద్దుతో బ్యాంకుల్లో భారీగా నగదు జమ అవుతోన్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో గత రెండు రోజులుగా బ్యాంకుల ముందు వందల మీటర్ల పొడవున క్యూలు ఉంటున్నాయి. సూర్య భగవానుడు సీరియస్ గా ఉన్నా కూడా ఏమాత్రం లెక్కచేయని జనాలు... అలా క్యూలో నిలబడే డిపాజిట్ లు చేయడం - నాలుగేసి వేల రూపాయలు మార్చుకోవడం చేస్తున్నారు. ఈ క్రమంలో డిపాజిట్ల విషయంలో ఒక్క ప్రభుత్వ బ్యాంకు రికార్డు సృష్టించింది.
రద్దైన రూ.500, రూ.1000 నోట్లను కొత్త వాటితో మార్చుకోవడంతో పాటు ఖాతాల్లో జమ చేసేందుకు జనం బ్యాంకుల వద్ద క్యూ కడుతున్న క్రమంలోలో దేశంలోని అతి పెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో తొలి రోజైన గురువారం రూ.31,000 కోట్ల నగదు జమ అవ్వగా - రెండో రోజైన శుక్రవారం మధ్యాహ్నానికి మరో రూ.22,000 కోట్ల డబ్బులు డిపాజిట్ అయ్యాయి. దీంతో రెండు రోజుల్లో సుమారు రూ.60,000 కోట్లపైనే డిపాజిట్స్ అయినట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఛైర్ పర్సన్ అరుంధతీ భట్టాచార్య వెల్లడించారు. ఇదే క్రమంలో ఈ రెండు రోజుల్లోనూ దేశవ్యాప్తంగా ఉన్న సేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖల్లో సుమారు రూ.1500 కోట్ల నగదు రద్దైన పెద్ద నోట్లకు మార్పిడి చేసినట్లు ఆమె వివరించారు.
ఒక్క ప్రభుత్వరంగ బ్యాంకులోనే ఈ రేంజ్ లో డిపాజిట్స్ ఉంటే... ఇక అన్ని బ్యాంకులను కలుపుకుంటే ఎంత మొత్తంలో పెద్ద నోట్లు జమ అయ్యి ఉంటాయో అన్నది ప్రస్తుతానికి లెక్కతోపాటు ఊహకందని విషయంగా ఉంది!
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/