Begin typing your search above and press return to search.

జ‌ర జాగ్ర‌త్త‌.. ఎస్‌ బీఐ వాయింపు షురూ!

By:  Tupaki Desk   |   1 Jun 2017 11:55 AM GMT
జ‌ర జాగ్ర‌త్త‌.. ఎస్‌ బీఐ వాయింపు షురూ!
X
దేశంలోనే అతి పెద్ద‌దైన దేశీయ బ్యాకింగ్ దిగ్గ‌జమైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. పొట్టిగా ఎస్ బీఐ ఇవాల్టి నుంచి వీపు ప‌గిలిపోయే సేవా రుసుముల్ని బాదేయ‌టం మొద‌లెట్టింది. ఏటీఎం న‌గ‌దు విత్ డ్రా మొద‌లు ఆన్ లైన్ లావాదేవీల వ‌ర‌కూ అన్నింటికి చార్జీల బాదుడే బాదుడు బాదేయ‌నున్నారు. ఈ రోజు (జూన్ 1) నుంచి అమ‌ల్లోకి రానున్న ఈ కొత్త రూల్స్ నేప‌థ్యంలో కాస్త లెక్క‌లు చూసుకోకుండా గ‌తంలో మాదిరి కార్య‌క‌లాపాలు జ‌రిపితే.. భారీగా ఛార్జీల మోత మోగ‌నుంది.

చివ‌ర‌కు చిరిగిన నోట్ల‌ను బ్యాంకుల్లో మార్చుకునే విష‌యంలోనూ ఛార్జీల్ని వ‌డ్డించ‌నుంది. 20 నోట్ల‌కు పైగా నోట్ల‌కు పైనే ఉన్న చిరిగిన నోట్ల‌కు ప్ర‌తి నోటుకు రూ.2 చొప్పున లేక‌పోతే ప్ర‌తి వెయ్యి రూపాయిల‌కు రూ.5 ప్లస్ స‌ర్వీసుఛార్జీల్లో ఏది ఎక్కువైతే దాన్ని ప‌రిగ‌ణ‌లోకి తీసుకొని వ‌డ్డించ‌నుంది.

బ్యాంకు బ్రాంచీల నుంచి కానీ ఏటీఎంల నుంచి కానీ న‌గ‌దు డ్రా చేసిన‌ప్పుడు నెల‌లో తొలి నాలుగు లావాదేవీల‌కు ఎలాంటి చార్జీలు ఉండ‌వు. ఆ త‌ర్వాత నుంచి మాత్రం ప్ర‌తి బ్యాంకులావాదేవీకి రూ.50 సేవాప‌న్నును వ‌సూలు చేస్తారు. ఇక‌.. ఎస్ బీఐ ఏటీఎం కార్డుతో తొలి నాలుగు లావాదేవీల‌కు ఎలాంటి రుసుములు ఉండ‌వు. కానీ.. ఇత‌ర బ్యాంకుల ఏటీఎంల నుంచి మాత్రం న‌గ‌దు డ్రా చేస్తే రూ.20.. ఎస్ బీఐ ఏటీఎం నుంచి డ్రా చేస్తే రూ.10 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది.

ఇవే కాదు.. మ‌రిన్ని సేవ‌ల‌కు ఎస్ బీఐ వ‌సూలు చేసే మొత్తాల్ని చూస్తే..

మొద‌ట‌గా బ్యాంకు ప్రాధ‌మిక సేవ‌ల‌కు సంబంధించి వ‌డ్డించే సేవా రుసుముల్ని చూస్తే..

+ చెక్ బుక్ జారీకి రూ.30 ప్ల‌స్ స‌ర్వీస్ ట్యాక్స్ (10 చెక్కులున్న పుస్త‌కానికి)

+ అదే 25 చెక్కులున్న పుస్త‌కం కోస‌మైతే రూ.75 ప్లస్ స‌ర్వీస్ ట్యాక్స్‌

+ 50 చెక్కులు ఉంటే అందుకు రూ.150 ప్ల‌స్ సేవా రుసుము
(ఏటీఎం కార్డు జారీకి.. రూపే క్లాసిక్ కార్డు మాత్రం ఉచితంగా అందించ‌నున్నారు)

ఆన్ లైన్ సేవ‌ల విష‌యానికి వ‌స్తే..

= స‌త్వ‌ర చెల్లింపు సేవ‌.. యూనిఫైడ్ పేమెంట్ బ‌దిలీ.. ఐయూఎస్ ఎస్ డీ లావాదేవీల‌కు రూ.ల‌క్ష వ‌ర‌కూ రూ.5 చొప్పున‌.. రూ.ల‌క్ష నుంచి రూ.2ల‌క్ష‌ల వ‌ర‌కూ రూ.15.. అదే రూ.2ల‌క్ష‌ల నుంచి రూ.5ల‌క్ష‌ల వ‌ర‌కూ రూ.25 వ‌సూలు చేస్తారు.

= వ్యాలెట్ లోని బ్యాలెన్స్ ను ఏటీఎం నుంచి డ్రా చేసుకుంటే రూ.25 చెల్లించాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/