Begin typing your search above and press return to search.
ఖాతాలో 20వేలుంటే ఫ్రీ క్రెడిట్ కార్డ్
By: Tupaki Desk | 29 March 2017 1:19 PM GMTచార్జీల భారంతో వినియోగదారులకు ఒకింత చేదు వార్తలను అందించిన స‌్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా ఖాతాదారులకు కొత్త ఆఫర్ ప్రకటించింది. ఖాతాలో రూ.20 వేల నుంచి రూ.25 వేల వరకు ప్రతి ఒక్కరికి ఉచితంగా క్రెడిట్ కార్డ్ ఇస్తామని స్పష్టంచేసింది. క్రెడిట్ హిస్టరీతో సంబంధం లేకుండా అకౌంట్ బ్యాలెన్స్ ఆధారంగానే క్రెడిట్ కార్డులు ఇవ్వనున్నారు. దీనికి మరో అధనపు సౌలభ్యం ఏమిటంటే... నాలుగేళ్ల పాటు ఎలాంటి వార్షిక రుసుం లేకుండా క్రెడిట్ కార్డ్ వాడుకోవచ్చు.
డిజిటల్ లావాదేవీల వైపు ప్రజలను పరుగులు పెట్టించాలని భావించినప్పటికీ అది ఆచరణ సాధ్యం కాకపోవడంతో ఎస్‌బీఐ ఆలోచనలో పడింది. ఈ క్రమంలో క్రెడిట్ కార్డుల సంస్కృతిని, డిజిటల్ పేమెంట్స్ ను ప్రోత్సహించడానికి ఎస్‌బీఐ కార్డ్ ఉన్నతి ఈ ఆఫర్ ప్రకటించింది. క్రెడిట్ హిస్టరీ వివరాలు లేకపోవడం వల్ల కార్డుల జారీ మెల్లగా సాగుతోంది. ఈ నేపథ్యంలో కొత్త యూజర్ల క్రెడిట్ హిస్టరీని ఈ కార్డుల జారీ ద్వారా తెలుసుకునే వీలుంటుంది. దీనివల్ల వారిని వ్యవస్థీకృత ఆర్థిక స్రవంతిలోకి తీసుకురాగులుగుతామని ఎస్‌బీఐ చైర్‌పర్సన్ అరుంధతి భట్టాచార్య అన్నారు.
మరోవైపు దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకైన ఎస్‌బీఐ.. తన ఐదు అనుబంధ బ్యాంకులతోపాటు భారతీయ మహిళా బ్యాంక్‌ను (బీఎంబీ) విలీనం చేసుకునే ప్రక్రియ వచ్చేనెల 1 నుంచి ప్రారంభం కానుంది. ఈ విలీనం మూడు నెలల్లో పూర్తి కానుందని ఎస్‌బీఐ ఎండీ రజినీష్ కుమార్ తెలిపారు. `విలీనం కోసం ఆర్‌బీఐ నుంచి మూడు నెలల గడువు కోరాం. అప్పటిలోగా ప్రక్రియ పూర్తి కావాలి. విలీనాన్ని దశలవారీగా కొనసాగించనున్నాం. అన్ని బ్యాంకుల డాటా అనుసంధానం పూర్తికాగానే ఖాతాదారులకు కొత్త పాస్‌బుక్‌లు, చెక్కు బుక్‌లు జారీ చేస్తాం` అని ఆయన వెల్లడించారు.
మరోవైపు విలీనం, డూప్లికేషన్ కారణంగా తర్వాత 1,500-1,600 బ్రాంచీలు మూసివేయనున్నట్లు ఆయన చెప్పారు. ప్రాంతాన్ని బట్టి ఎస్‌బీఐ శాఖను మూసివేయాలా లేదంటే అనుబంధ బ్యాంకు బ్రాంచీని మూసివేయాలా అన్న అంశాన్ని నిర్ణయించనున్నట్లు రజినీష్ కుమార్ వెల్లడించారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ తో(ఎస్ బీహెచ్) - స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీర్ అండ్ జైపూర్(ఎస్ బీబీజే) - స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్ (ఎస్ బీఎం) - స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్ కోర్ (ఎస్ బీటీ) - స్టేట్ బ్యాంక్ ఆఫ్ పటియాలా (ఎస్ బీపీ) - ఇంకా బీఎంబీని ఎస్ బీఐలో విలీనం చేసేందుకు కేంద్ర క్యాబినెట్ ఇప్పటికే ఆమోదించిన సంగతి తెలిసిందే. విలీనం తర్వాత 50 కోట్ల కస్టమర్లు, రూ.37 లక్షల కోట్ల ఆస్తులు, 22,500 శాఖలు, 58వేల ఏటీఎంలతో ప్రపంచంలోని 50 అతిపెద్ద బ్యాంక్ ల్లో ఒకటిగా ఎస్ బీఐ అవతరించనుంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/