Begin typing your search above and press return to search.
ఎస్బీఐ ఏటీఎంకు వెళ్తున్నారా? ఓటీపీ తప్పనిసరి!
By: Tupaki Desk | 28 Dec 2019 6:26 AM GMTనూతన సంవత్సరం సందర్భంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎం సేవలకు సంబంధించి కొత్త నిబంధనను ప్రవేశ పెడుతూ ఉంది. రాత్రి పూట జరిగే ఏటీఎం విత్ డ్రాలకు వన్ టైమ్ పాస్ వర్డ్ ను తప్పనిసరి చేస్తూ ఉంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. రాత్రి ఎనిమిది నుంచి ఉదయం ఎనిమిగి గంటల వరకూ జరిగే అన్ని విత్ డ్రాలకూ ఓటీపీని తప్పనిసరి చేసింది. 2020లో జనవరి ఒకటో తేదీ నుంచి ఈ నియమం అమల్లోకి రానుంది.
మామూలుగా నెట్ బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్లకు ఓటీపీని చూస్తూ ఉంటాం. ఏటీఎంలలో డబ్బు డ్రా చేయడానికి పిన్ నంబర్ సరిపోతుంది. అయితే ఇక నుంచి ఎస్ బీఐ మాత్రం కేవలం పిన్ నంబర్ తో డబ్బులను మీ చేతికి ఇవ్వదు. పిన్ నంబర్ కొట్టిన తర్వాత, మీరు క్యాష్ నంబర్ ను ఎంటర్ చేసిన తర్వాత.. సదరు అకౌంట్ రిజిస్ట్రర్డ్ ఫోన్ నంబర్ కు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేస్తేనే.. క్యాష్ డ్రా అవుతుంది. లేకపోతే ఆ ట్రాన్సాక్షన్ రద్దు అవుతుంది.
అంటే.. జనవరి ఒకటో తేదీ నుంచి మీరు ఎస్బీఐ ఏటీఎం ద్వారా డబ్బులు డ్రా చేయాలంటే.. ఏ అకౌంట్ నుంచి డబ్బులు డ్రా చేస్తున్నారో - ఆ అకౌంట్ కు సంబంధించిన సిమ్ కార్డ్ యాక్టివ్ అయిన ఫోన్ మీ వెంట ఉండాల్సిందే - లేకపోతే డబ్బులు డ్రా చేయలేరు.
మోసపూరిత ఏటీఎం విత్ డ్రాలు రాత్రి పూటే ఎక్కువగా జరుగుతాయనే అంచనాతో ఎస్బీఐ ఈ నియమాన్ని తీసుకొచ్చింది. ట్రాన్సాక్షన్లు మరింత భద్రంగా జరగడానికి ఈ నియమం పనికొస్తుంది. అయితే ఎస్బీఐ ఏటీఎం ను ఇతర ఏటీఎంలలో వాడుకున్నప్పుడు మాత్రం ఈ ఓటీపీ అవసరం ఉండదని తెలుస్తోంది.