Begin typing your search above and press return to search.

జనం ధనంతో మాల్యాకు రుణ మాఫీ

By:  Tupaki Desk   |   16 Nov 2016 9:14 AM GMT
జనం ధనంతో మాల్యాకు రుణ మాఫీ
X
పెద్ద నోట్ల రద్దుతో దేశ ప్రజలంతా నానా పాట్లు పడుతున్న తరుణంలో ఎస్బీఐ తీసుకున్న ఓ నిర్ణయం ప్రజలకు కోపం తెప్పిస్తోంది. 500 - 1000 నోట్ల రద్దుతో తమ వద్ద ఉన్న ఆ నోట్లను జనం వెళ్లి ఖాతాల్లో వేసుకుంటున్నారు. తిరిగి తీసుకోవడానికి పరిమితులు పెట్టడంతో చాలా స్వల్ప మొత్తంలో మాత్రమే తీసుకోగలుగుతున్నారు. దీంతో ఏటీఎం - బ్యాంకుల వద్ద జనం పడిగాపులు కాస్తున్నారు. ఇదే సమయంలో జనం డబ్బు భారీగా జమ కావడంతో వేల కోట్లు ఎగ్గొట్టి విదేశాలకు చెక్కేసిన విజయ్ మాల్యా, అలాంటి అప్పుల అప్పారావుల రుణాలను రద్దు చేసి వారికి మేలు చేశారు. ముంబయి బేస్డ్ డీఎన్ ఏ పత్రిక లో ఈ రోజు కథనం రావడంతో ప్రజలు మండిపడుతున్నారు. తాము తమ డబ్బు తీసుకోవడానికి వెళ్తేనే గంటలుగంటలు వెయిట్ చేయాల్సి వస్తోందని.. ఒకసారి తీసుకుంటే మళ్లీ తీసుకోకుండా వేలికి సిరా చుక్క పెట్టుకోవాల్సి వస్తోందని.. కానీ మా డబ్బుతో మాల్యాకు రుణమాఫీ ఎలా చేస్తారని ప్రశ్నిస్తున్నారు

మాల్యా, అలాంటి వారి నుంచి రావాల్సిన బకాయిలు ఇక రావని నిర్ణయానికి వచ్చిన ఎస్బీఐ వాటిని రద్దు చేసింది. తాజాగా 7,016 కోట్ల రుణాలను రద్దు చేయగా.. ఈ ఏడాది జూన్ 30 నుంచి ఇప్పటివరకు మొత్తం 48 వేల కోట్ల రుణాలు రద్దు చేశారు. ఇలా రద్దు చేసినవాటిలో మాల్యాదే పెద్ద వాటా.

ఆంధ్రప్రదేశ్ కు చెందిన విక్టరీ ఎలక్ర్టికల్స్.. పారామౌంట్ ఎయిర్ వేస్.. కేఆర్ ఆర్ ఇన్ ఫ్రా ప్రాజెక్టులు.. ఘన్ శ్యామ్ దాస్ జెమ్స్ అండ్ జ్యూయల్స్ - యాక్సిస్ స్ట్రక్చర్స్ ప్రయివేట్ లిమిటెడ్ వంటి సంస్థలున్నాయి. తెలంగాణకు చెందిన ఎస్ ఎస్ వీజీ ఇంజినీరింగ్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్.. టోటెమ్ ఇన్ఫ్రా వంటివి ఉన్నాయి. మొత్తం లిస్టులో మాల్యాకు చెందిన కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్సు టాప్ లో ఉంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/