Begin typing your search above and press return to search.

గోవిందాను సారీ చెప్పాలన్న కోర్టు

By:  Tupaki Desk   |   1 Dec 2015 3:56 AM GMT
గోవిందాను సారీ చెప్పాలన్న కోర్టు
X
బాలీవుడ్ నటుడు గోవిందాకు ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది. సినిమా షూటింగ్ సందర్భంగా ఒక వ్యక్తిని గోవిందా చెంపదెబ్బ కొట్టిన అంశానికి సంబంధించి కోర్టులో ఆయనకు చుక్కెదురు అయ్యింది. గోవిందా చెంపదెబ్బ కొట్టిన దాన్ని మొబైల్ లో చిత్రీకరించిన నేపథ్యంలో.. ఆ సాక్ష్యాన్ని చూసిన కోర్టు.. హీరోకు హితోపదేశం చేసింది. సదరు వ్యక్తికి సారీ చెప్పాలని సూచించింది. మీరు పెద్ద నటులని.. పెద్ద మనసు చూపించాలన్న న్యాయమూర్తి.. ఈ సందర్భంగా కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఫిర్యాదుదారుడితో ఉన్న వివాదాన్ని పరిష్కరించుకోలంది. సినీ జీవితంలో చేసినట్లుగా నిజజీవితంలో చేయటం సాధ్యం కాదన్న న్యాయమూర్తి.. సినిమాలు చూసి ఎంజాయ్ చేస్తామని.. అంతమాత్రాన నిజ జీవితంలో తప్పు చేస్తే వదిలేయటం ఉందని స్పష్టం చేశారు. సినిమాల్లో గోవిందా నటనను ఎంజాయ్ చేస్తామని.. అలా అని నిజ జీవితంలో ఎవరినైనా కొడితే సహించేది లేదని స్పష్టం చేశారు. షూటింగ్ సందర్భంగా చేయి చేసుకున్న వ్యక్తితో హీరో గోవిందాకు రాజీ మినహా మరో మార్గం లేదు. కాదంటే.. తిప్పలు తప్పవన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.