Begin typing your search above and press return to search.
రామ్ దేవ్ బాబా ‘అల్లోపతి’ వ్యాఖ్యలపై.. సుప్రీం కీలక ఆదేశాలు
By: Tupaki Desk | 30 Jun 2021 12:44 PM GMTయోగా గురువు రాందేవ్ అల్లోపతి వైద్య విధానంపై అసత్య, అవాంఛనీయ వ్యాఖ్యలు చేశారంటూ.. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మొదలు.. కేంద్ర మంత్రుల వరకు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయమై వైద్యులు సుప్రీం కోర్టును సైతం ఆశ్రయించారు.
కొవిడ్ పరిస్థితిని తన వ్యాపారానికి అనుకూలంగా మార్చుకునేందుకు రాందేవ్ ప్రయత్నిస్తున్నారని, తన కరోనిల్ మందును ప్రచారం చేసుకునేందుకు అల్లోపతిపై నిందలు వేస్తున్నారని ఐఎంఏ పేర్కొంది. కరోనా సంక్షోభంతో దేశం అల్లాడుతున్న వేళ రాందేవ్ తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నారని, రాందేవ్ చేస్తున్న వ్యాఖ్యలు సైన్స్ తోపాటు, వైద్యుల ప్రతిష్టను మంటగలిపే విధంగా ఉన్నాయని వైద్యులు ఆగ్రహం వ్యక్తంచేశారు.
అయితే.. తాజాగా ఈ కేసును సుప్రీం విచారించింది. రామ్‌దేవ్ తరపున వాదనలు వినిపించిన ముఖుల్ రోహత్గి.. ఆయనకు వాట్సాప్ లో వచ్చిన ఓ మెసేజ్ ను మాత్రమే చదివి వినిపించారని, అంతే తప్ప.. వైద్యులపై, అల్లోపతి వైద్య విధానంపై రామ్ దేవ్ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని చెప్పారు. దీనికి స్పందించిన ధర్మాసనం.. అసలు రామ్ దేవ్ మాట్లాడిన ఒరిజినల్ రికార్డులను సమర్పించాలని ఆదేశించింది. ఒరిజినల్ వీడియో, అందులోని మాటలను రాసిన పత్రాలను సమర్పిస్తామని న్యాయవాది ముకుల్ రోహత్గి కోర్టుకు తెలిపారు. దీంతో.. కేసును జూలై 5వ తేదీకి వాయిదా వేసింది సుప్రీం.
కాగా.. ‘‘అల్లోపతి ఒక కుంటి శాస్త్రం. మొదట హైడ్రాక్సీ క్లోరోక్విన్ విఫలమైంది. ఇప్పుడు రెమ్ డెసివర్ వంటివి కూడా ఫెయిలయ్యాయి. యాంటీ బయాటిక్స్ సైతం విఫలమయ్యాయి. ఆక్సీజన్‌కొరతకన్నా.. ఈ మందుల వల్లనే లక్షలాది మంది చనిపోయారు’’అని రామ్ దేవ్ ఆ వీడియోలో అన్నారు. దీంతో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.