Begin typing your search above and press return to search.
కశ్మీర్ విభజనలో జోక్యంచేసుకోలేం: సుప్రీం
By: Tupaki Desk | 1 Oct 2019 11:25 AM GMTఆర్టికల్ 370 రద్దు - కశ్మీర్ విభజనకు వ్యతిరేకంగా సుప్రీం కోర్టు తలుపుతట్టిన ప్రతిపక్షాలు, కొందరు కశ్మీరీలకు గట్టి షాక్ తగిలింది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న కశ్మీర్ విభజన విధాన నిర్ణయంలో తాము జోక్యం చేసుకోలేమని సుప్రీం కోర్టు తేల్చిచెప్పింది.
జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల బెంచ్ ముందుకు వచ్చిన కశ్మీర్ విభజనపై దాఖలైన 9 పిటీషన్లపై ఈరోజు ధర్మాసనం విచారించింది. కేంద్రం కశ్మీర్ ను విభజిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని తాము నిలుపుదల చేయలేమని స్పష్టం చేసింది.
అయితే ఈ వ్యాజ్యాలపై అభ్యంతరాలకు వివరణ ఇవ్వాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీనికోసం నాలుగు వారాల గడువు ఇచ్చింది. కశ్మీర్ విభజనపై తదుపరి విచారణను నవంబర్ 14కు వాయిదా వేసింది.
ఈ అక్టోబర్ 31నుంచి జమ్మూకశ్మీర్ - లఢక్ లు కేంద్ర పాలిత ప్రాంతాలుగా మారనున్నాయి. ఈ మేరకు ఆగస్టు 5న కేంద్ర ప్రకటన చేసింది. పార్లమెంట్ లో కశ్మీర్ ను విభజిస్తూ ఆర్టికల్ 370 రద్దు బిల్లును కేంద్ర ప్రభుత్వం పాస్ చేయించింది. దీనిపై చాలా మంది సుప్రీం కోర్టు గడప తొక్కగా ఈ తీర్పుతో నిరాశ ఎదురైంది.