Begin typing your search above and press return to search.
ఏపీ సర్కారుపై ఎస్సీ కమిషన్ గుస్సా
By: Tupaki Desk | 16 Nov 2021 2:54 PM GMTఏపీలోని వైసీపీ ప్రభుత్వంపై కేంద్ర ప్రభుత్వం, జాతీయ స్థాయి కమిషన్లు వరుసబెట్టి ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్న వైనం తెలిసిందే. అందులో భాగంగానే తాజాగా జాతీయ ఎస్సీ కమిషన్ ఏపీ ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాకుండా వరుసబెట్టి మూడు లేఖలు రాసిన జాతీయ ఎస్సీ కమిషన్ ఏపీ ప్రభుత్వానికి డెడ్ లైన్ కూడా పెట్టేసింది. మొద్దు నిద్రలో జోగుతున్నట్లుగా కనిపిస్తున్న ఏపీ అధికార యంత్రాంగం కనీసం ఈ డెడ్ లైన్‌లో అయినా జాతీయ ఎస్సీ కమిషన్ అడిగిన మేరకు వివరాలు సమర్పిస్తుందా? లేదా? అన్న విషయంపై ఇప్పుడు ఆసక్తికర చర్చ నడుస్తోంది. అసలు ఏపీ సర్కారు తీరుపై జాతీయ కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేయడానికి దారి తీసిన కారణాలు ఏమిటన్న విషయానికి వస్తే.. పలు ఆసక్తికర అంశాలు వెలుగు చూడటం ఖాయమే.
ఏపీలో పెద్ద ఎత్తున మత మార్పిడులు జరుగుతున్నాయని, అందులో ఎస్సీలనే టార్గెట్ చేసుకుని మత మార్పిడులు జోరుగా సాగుతున్నాయని జాతీయ ఎస్సీ కమిషన్‌ను ఏపీ నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందాయట. ఈ ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకున్న కమిషన్.. అసలు ఏపీలో మత మార్పిడులు జరుతున్నాయా? లేదా? అసలు రాష్ట్రంలో మత మార్పిడులకు సంబంధించి ఏం జరుగుతోంది? దీనిపై ఓ సమగ్ర నివేదిక పంపాలని ఈ ఏడాది జూలైలోనే జాతీయ ఎస్సీ కమిషన్ ఏపీ సర్కారుకు ఓ లేఖ రాసింది. కారణాలేమిటో తెలియదు గానీ.. ఈ లేఖను అప్పటి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్య నాథ్ దాస్ పట్టించుకోలేదు. దాస్ స్థానంలో ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పదవీ బాధ్యతలు చేపట్టిన సమీర్ శర్మ కూడా అంతగా పట్టించుకోలేదు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పట్టించుకోకున్నా.. కనీసం సాంఘీక సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి కూడా పట్టించుకోలేదు. వెరసి జాతీయ ఎస్సీ కమిషన్ పంపిన లేఖకు ఏపీ ప్రభుత్వం నుంచి కనీస స్పందన లేదు.
ఈ క్రమంలో జూలైలో తాము అడిగిన వివరాలు ఇంకా పంపించలేదని, కనీసం ఇప్పటికైనా దీనిపై దృష్టి సారించి నివేదిక పంపాలని ఈ నెల 3న జాతీయ ఎస్సీ కమిషన్ ఏపీ ప్రభుత్వానికి మరో లేఖ రాసింది. ఈ లేఖ అంది ఇప్పటికే 15 రోజులు దాటుతున్నా కూడా ఏపీ ప్రభుత్వం స్పందించిన దాఖలా కనిపించలేదు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన జాతీయ ఎస్సీ కమిషన్.. మత మార్పిడులపై నివేదిక పంపాలని రాసిన లేఖలకు ఎందుకు స్పందించలేదని తాజాగా ఏపీ సర్కారుకు మరో లేఖ రాసింది. అంతేకాకుండా మునుపటిలా ఈ దఫా కూడా నివేదిక పంపడంలో జాప్యం కుదరదని, తమ లేఖ అందిన వారం రోజుల్లోగా నివేదిక పంపాలని తాజా లేఖలో ఏపీ సర్కారుకు డెడ్ లైన్ విధించింది. ఇప్పటికే జాతీయ ఎస్సీ కమిషన్ రాసిన రెండు లేఖలను పట్లించుకోని ఏపీ ప్రభుత్వం.. తాజా లేఖకు అయినా స్పందించి నివేదికను పంపుతుందో, లేదో చూడాలి.