Begin typing your search above and press return to search.
రేప్ చేసి చంపేస్తే 84 నెలలే జైలా?
By: Tupaki Desk | 15 Sep 2016 9:27 AM GMTకదులుతున్న రైల్లో అత్యాచారం చేయటమే కాదు.. రైల్లో నుంచి తోసేసిన ఉదంతం ఐదేళ్ల క్రితం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కేరళలో జరిగిన ఈ దారుణంలో 24 ఏళ్ల సౌమ్య మరణించింది. షాపింగ్ మాల్ లో పని చేసే ఆమె 2011 ఫిబ్రవరి 1న మహిళా బోగీలో ఒంటరిగా ప్రయాణించింది. ఏర్నాకులం నుంచి శొర్ నూర్ వరకూ ట్రైన్లో ట్రావెల్ చేస్తున్న వేళ.. ఆమెపై రైల్లోనే అత్యాచారం చేశాడు గోవిందచామి. రైల్లో దొంగతనానికి వచ్చిన గోవిందచామి ఆమెను అత్యాచారం చేసి.. రైల్లో నుంచి తోసేశాడు. తీవ్ర గాయాలపాలైన ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది.
ఈ ఉదంతం అప్పట్లో దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసును విచారించిన కోర్టు అతడికి మరణశిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చాయి. నేర చరిత్ర కలిగిన గోవిందచారి చేసిన నేరం నిరూపితమైంది. సౌమ్యను అత్యాచారం చేసిన ఘటనలో గోవిందాచారి మీద అత్యాచారం.. హత్య కేసులు నమోదయ్యాయి. అతడ్ని దోషిగా తేలుస్తూ 2012లో త్రిశూర్ ఫాస్ట్ ట్రాక్ కోర్టు అతడికి మరణశిక్ష విధించింది.
అనంతరం అప్పీలుకు వెళ్లినా.. ఉన్నత న్యాయస్థానాలు సైతం అతడికి మరణశిక్షను కన్ఫర్మ్ చేశారు. తాజాగా ఈ కేసు సుప్రీం తలుపు తట్టింది. ఈ కేసును విచారించిన కోర్టు అనూహ్యంగా మరణశిక్ష నుంచి ఏడేళ్ల శిక్షకు తగ్గిస్తూ తీర్పు చెప్పటం సంచలనంగా మారింది. ఈ కేసు విచారణలో సౌమ్యను అత్యాచారం చేసినట్లు నిరూపితమైనా.. ఆమెను ట్రైన్లో నుంచి తోసేసిన అభియోగాన్ని నిరూపించటంలో దర్యాప్తు సంస్థలు విఫలమయ్యాయి.
దీంతో అతడికి విధించిన మరణశిక్షను కాస్తా ఏడేళ్ల జైలుశిక్ష విధిస్తూతీర్పు ఇచ్చారు. ఇప్పటికే 67 నెలలుగా ఉన్న గోవిందాచారి.. మరో 16 నెలల్లో జైలు నుంచి విడుదలయ్యే అవకాశం లభించనుంది. ఒక అమాయక మహిళను దారుణంగా అత్యాచారం చేసిన ఒక మానవ మృగం మీద హత్య చేసిన నేరం నిరూపితం కాని నేపథ్యంలో ఏడేళ్ల జైలుకు పరిమితం చేస్తారా? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. చట్టం ప్రకారం అత్యాచార దోషులకు ఇంత తక్కువ శిక్ష విధించటం ఏమిటన్న ఆగ్రహాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు.