Begin typing your search above and press return to search.

కిక్కిరిసిన సుప్రీం.. అసహనం వ్యక్తం చేసిన సీజే

By:  Tupaki Desk   |   22 Jan 2020 5:02 AM GMT
కిక్కిరిసిన సుప్రీం.. అసహనం వ్యక్తం చేసిన సీజే
X
ఇప్పటివరకూ థియేటర్లు హౌస్ ఫుల్. క్రీడా స్టేడియంలు కిక్కిరిసిపోవటం గురించి విన్నాం. కానీ.. ఎప్పుడూ లేని రీతిలో సుప్రీంకోర్టు కిక్కిరిసిపోయిన వైనం ఈ రోజు చోటు చేసుకుంది. ఇవాళ ప్రత్యేకమైన రోజు కూడా ఏమీ కాదు కదా? అనుకుంటే తప్పులో కాలేసినట్లే. ఎందుకంటే.. మోడీ సర్కారు తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఏకంగా 140 పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిని ఈ రోజు సుప్రీంకోర్టులో విచారించనున్నారు.

ఈ పిటిషన్ల విచారణ నేపథ్యంలో.. పిటిషన్ దారులు.. వారి తరఫు లాయర్లతో పాటు.. ఇతరులు కూడా కోర్టుకు పెద్ద ఎత్తున రావటంతో సుప్రీంకోర్టు ప్రాంగణమంతా కిక్కిరిసిపోయింది. కోర్టు గదిలోకి వచ్చేందుకు లాయర్లు.. పిటిషన్ దారులు ఒకరినిఒకరు తోసుకుంటూ ఉండటంపైన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ ఏ బోబ్డే సైతం అసహనం వ్యకర్తం చేశారు. ఇంత భారీగా సమూహం వచ్చినప్పుడు మీరేం చేస్తున్నారన్న ఆగ్రహంతో పాటు.. అందరిని కంట్రోల్ చేయాలని భధ్రతా సిబ్బందిని ఆదేశించారు.

అనంతరం అన్ని పిటిషన్లపై ధర్మాసనం విచారణ ప్రారంభించారు. పౌరసత్వ సవరణ చట్టంపై దాఖలైన పిటిషన్లను రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేయాలని సీనియర్ న్యాయవాది కాంగ్రెస్ నేత కపిల్ సిబల్ వ్యాఖ్యానించగా.. మరోవైపు అటార్నీ జనరల్ మాట్లాడుతూ.. పౌరసత్వ సవరణ చట్టంపై కేంద్రం ప్రాథమిక అఫిడవిట్ ను సిద్ధం చేసిందని.. దానిని రాజకీయ పార్టీలకు అందజేస్తామని వెల్లడించారు. సిబల్ వాదనను విన్న ధర్మాసనం.. అవసరమైతే ఆ పని చేస్తామని పేర్కాన్నారు. ప్రస్తుతం దాఖలైన పిటిషన్లపైన వాదనలు సాగుతున్నాయి.