Begin typing your search above and press return to search.
మంగళవారం మహా పై తీర్పు ఇవ్వనున్న సుప్రీం
By: Tupaki Desk | 25 Nov 2019 7:18 AM GMTమహారాష్ట్ర రాజకీయంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. రెండు రోజుల క్రితం అనూహ్యంగా కొలువు తీరిన ఫడ్నవీస్ సర్కారు తన బలపరీక్ష విషయంపై దాఖలైన వాజ్యంపై సుప్రీం కోర్టు తన తీర్పును రేపటికి (మంగళవారం) వాయిదా వేసింది. మహారాష్ట్రలో మీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అంశంపై గవర్నర్ తీసుకున్న నిర్ణయంపై సుప్రీంకోర్టులో వాడి వేడిగా వాదనలు నడిచాయి.
ముఖ్యమంత్రిగా ఉన్న ఫడ్నవీస్ కు మెజార్టీ ఉందా? అని ప్రశ్నించిన అత్యుత్తమ న్యాయస్థానం.. బలపరీక్షకు రాజ్ భవన్ వేదిక కాబోదని చెప్పారు. అదే సమయంలో ఈ అంశంపై తుది తీర్పును మంగళవారం వెలువరుస్తామని పేర్కొన్నారు. తెల్లవారు జామున 6.47 గంటల ప్రాంతంలో రాష్ట్రపతి పాలనను ఎత్తేయటం ఏమిటన్న శివసేన.. కాంగ్రెస్ తరఫు న్యాయవాది వాదనను ధర్మాసనం అభ్యంతరం చెబుతూ గవర్నర్ నిర్ణయాల్లో తలదూర్చమన్నారు.
ఫడ్నవీస్ ప్రభుత్వం బలపరీక్షకు రెండుమూడు రోజుల సమయం ఇవ్వాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోరారు. ఈ సందర్భంగా గవర్నర్ కు సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కు మధ్య జరిగిన లేఖల్ని కోర్టుకు సమర్పించారు. శివసేన, కాంగ్రెస్.. ఎన్సీపీ తరఫున కపిల్ సిబల్ వాదనలు వినిపించగా.. అజిత్ పవార్ తరఫున మణీందర్ సింగ్ వాదనలు వినిపించారు. వీరి వాదనలు విన్న సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం తాజా ఆదేశాలు జారీ చేసింది.
మహారాష్ట్ర అసెంబ్లీలో 288 అసెంబ్లీ స్థానాలు ఉండగా బీజేపీ 105 స్థానాల్లో శివసేన 56 స్థానాల్లో ఎన్సీపీ 54.. కాంగ్రెస్ 44 స్థానాల్లో గెలవగా.. మిగిలిన స్థానాల్లో ఇతరులు గెలుపొందారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటానికి 145 మంది ఎమ్మెల్యేల బలం అవసరం. ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీకి 105 స్థానాలతో పాటు అజిత్ పవార్ చీల్చే ఎమ్మెల్యేలతో పాటు..ఇండిపెండెంట్లు ఉన్నారని చెబుతున్నారు. వాస్తవంలో మాత్రం అలాంటిది కనిపించట్లేదన్న వాదన కనిపిస్తోంది.
అయితే.. బలపరీక్ష ఎప్పుడన్న విషయంపై సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయాన్ని వెలువరిస్తుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. పార్టీలు ఇచ్చిన లేఖల ఆధారంగానే గవర్నర్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా కోరినట్లు సొలిసిటర్ జనరల్ వాదించారు. మూడు పక్షాల వాదనలు విన్న సుప్రీం ధర్మాసనం.. తమ తుది తీర్పును మంగళవారం ఉదయం 10.30 గంటలకు వెలువరిస్తామని పేర్కొన్నారు.