Begin typing your search above and press return to search.
'ఇండియా'ను భారత్ గా మార్చండి: సుప్రీం కోర్టులో పిటిషన్
By: Tupaki Desk | 30 May 2020 2:30 AM GMTఇండియా పేరును భారత్ లేదా హిందూస్థాన్ గా మార్చాలని ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ సందర్భంగా 1948లో దేశం పేరును భారత్ లేదా హిందూస్థాన్ గా పెట్టాలని బలమైన వాదన వినిపించిందని గుర్తు చేశారు. ఈ పిటిషన్ జూన్ 2వ తేదీన విచారణకు రానుంది. పేరును ఎందుకు మార్చాలో కూడా పిటిషన్ లో వివరించారు.
దేశం పేరు మార్చడంవల్ల ప్రజల్లో ఆత్మగౌరవం - జాతీయభావం పెరుగుతుందని తెలిపారు. దేశం పేరును మార్చేందుకు రాజ్యాంగంలోని ఆర్టికల్ 1లో సవరణలు చేసేలా కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని అత్యున్నత న్యాయస్థానాన్ని కోరారు. ఇండియా అనేది ఇంగ్లీష్ పదమని, దానిని తొలగించి స్వదేశీ భాషలో పేరు పెడితే అది ప్రజలకు గర్వకారణంగా ఉంటుందన్నారు.
ఈ పిటిషన్ దాఖలు చేసిన వ్యక్తి నమహ్. ఇండియా అనే పేరును ఉపయోగించడం ద్వారా బానిసత్వ చిహ్నాన్ని తొలగించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. వాస్తవానికి దేశం పేరు మార్చాలని దాఖలైన పిటిషన్ ఇవాళ సుప్రీం కోర్టులో విచారణకు ముందే లిస్ట్ అయింది. అయితే సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ బాబ్డే అందుబాటులో లేకపోవడంతో ఆ తర్వాత లిస్ట్ నుండి పిటిషన్‌ను తొలగించారు. కోర్టుకు అందుబాటులో ఉన్న నోటీసు ప్రకారం జూన్ 2వ తేదీన ధర్మాసనం ముందుకు విచారణకు రానుంది.