Begin typing your search above and press return to search.
పరీక్షల్లో బురఖా ధరించకుంటే విశ్వాసానికి దెబ్బా!
By: Tupaki Desk | 26 July 2015 5:27 AM GMTనిబంధనలు ఏవైనా అందరికి ఒకేలా ఉండాలే తప్పించి.. మతం ఆధారంగా నిబంధనలు ఏ మాత్రం సరికాదు. తాజాగా ఒక సున్నిత అంశంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు సూటిగా.. స్పష్టంగా ఉంది.
అలిండియా మెడికల్ పరీక్షల్లో మైనార్టీ వర్గాలకు చెందిన మహిళలు పరీక్షలు రాసే సమయంలో బురఖా ధరించటాన్ని అనుమతించాలని కొందరు వాదించటం తలిసిందే. పరీక్షహాల్లోబురఖా ధరించకపోవటం కారణంగా తమ మత విశ్వాసాలు దెబ్బ తింటాయన్నది వారి వాదన. ఈ వ్యవహారం సుప్రీం తలుపు తట్టింది. ఇలాంటి సున్నితమైన అంశాల విషయంలో ఆచితూచి వ్యవహరించిన సుప్రీం.. తన మాటను స్పష్టంగా చెప్పేసింది.
ఒక వ్యక్తి.. బురఖా ధరించకుండా కొన్ని గంటల పాటు పరీక్ష రాసినంత మాత్రాన ఆయా మతానికి చెందిన విశ్వాసం దెబ్బ తింటుందనటం సరికాదని పేర్కొంది. మత విశ్వాసాల కోసం నిబంధనల్ని మార్చటం మంచిది కాదని చెప్పిన సుప్రీం.. మత విశ్వాసాలు నిబంధనలు వేర్వేరు అంశాలని పేర్కొంది. నిబంధనలు అందరికి ఒకేలా ఉండాలే తప్పించి.. మతాల ఆధారంగా మినహాయింపులు కోరటం ఏ మాత్రం మంచిది కాదు.
విశ్వాసాల్ని గౌరవించాల్సిందే. కానీ.. ఆ పేరు మీద ఎవరైనా అక్రమాలకు పాల్పడితే.. అమాయక విద్యార్థులు ఎందరో బలి కావాల్సి ఉంటుంది. ముఖ్యమైన పరీక్షల సందర్భంలో హైటెక్ టెక్నాలజీ వినియోగించి పలు అక్రమాలకు పాల్పడుతున్న ప్రస్తుత తరుణంలో.. ఇలాంటి కచ్ఛితమైన నిర్ణయాల్ని తేల్చి చెప్పాల్సిన అవసరం ఉందని అత్యున్నత న్యాయస్థానం నిర్ణయించటం మంచి పరిణామంగా పలువురు అభివర్ణిస్తున్నారు. మతం నమ్మకాలకు ప్రతీకగా ఉండాలే కానీ.. మతం ఆధారంగా సమాజం.. సర్కారు నడవటం ఏ మాత్రం సరికాదు.