Begin typing your search above and press return to search.
శబరిమలపై సుప్రీం తీర్పుకు మహిళా జడ్జి వ్యతిరేకం
By: Tupaki Desk | 28 Sep 2018 8:05 PM GMTశబరిమలపై సుప్రీంకోర్టు సంచలన నిర్ణయాన్ని వెలువరించటం తెలిసిందే. శబరిమల ఆలయంలోకి మహిళల్ని అనుమతించాలన్న అంశంపై సుప్రీం సానుకూలంగా నిర్ణయం తీసుకొని తీర్పును వెలువరించింది. ఈ తీర్పును సుప్రీం ధర్మాసనం 3:1 మెజార్టీతో వెలువరించారు. అయితే.. నలుగురు సభ్యులున్న ధర్మాసనంలో మిగిలిన న్యాయమూర్తుల నిర్ణయాన్ని వ్యతిరేకించిన న్యాయమూర్తి మహిళా జడ్జి కావటం గమనార్హం.
తీర్పును అంగీకరించని ఆమె.. తన వాదనను స్పష్టంగా వెల్లడించారు. సుప్రీం తీర్పును తాను అంగీకరించని ఆమె జస్టిస్ ఇందూ మల్హోత్రా ధర్మాసనం తీర్పును వ్యతిరేకించారు. మతపరమైన మనోభావాలను కోర్టులు అడ్డుకోకూడదన్న ఆమె.. ఈ తీర్పునకు.. ట్రిపుల్ తలాక్ పై ఇచ్చిన తీర్పుకు ఉన్న తేడాల్ని ఆమె చెప్పుకొచ్చారు.
ట్రిపుల్ తలాక్.. సెక్షన్ 377 కేసుల్లో నిజమైన బాధితులతో పాటు.. ఇతర సామాజిక సంస్థలు కూడా పిటిషన్ ను దాఖలు చేశాయని గుర్తు చేయటమే ప్రత్యేక ప్రాముఖ్యతకు కారణమైందన్నారు. కానీ.. శబరిమల కేసులో కేరళకు చెందిన ఏ మహిళా శబరిమల ప్రవేశాన్ని కోరుకోలేదన్న విషజ్ఞాన్ని ఆమె గుర్తు చేశారు. ఏ కేరళ మహిళా సుప్రీంకోర్టును ఆశ్రయించలేదన్నది మర్చిపోకూడదని చెప్పారు.
కేరళ మహిళలు ఎక్కువ మంది శబరిమలలో ఆచరించే పద్దతులకు వ్యతిరేకంగా లేరన్న విషయాన్ని మర్చిపోకూడదన్నారు. భారతదేశం భిన్నమైన మతాచారాల్ని కలిగి ఉంటుందని.. ఒక మతాన్ని గౌరవించటానికి..పాటించటానికి రాజ్యాంగం అనుమతి ఇస్తుందని.. అంతే కానీ వారు అనుసరిస్తున్న మతాచారాల్లోకి జోక్యం చేసుకోవటానికి లేదన్న వాదనను ఆమె వినిపించటం గమనార్హం.