Begin typing your search above and press return to search.
న్యాయం గెలిచింది ..సుప్రీం తీర్పు పై సోనియా హర్షం !
By: Tupaki Desk | 26 Nov 2019 6:59 AM GMTమహారాష్ట్ర లో రాజకీయాలు క్షణానికొక మలుపు తిరుగుతున్నాయి. ఏ క్షణంలో ఏమౌతుందో ఎవరికీ అర్థం కావడం లేదు. ఊహించని పరిణామాలు , ఊహకందని మలుపు ..ఇలా మహా రాజకీయం ట్విస్టులు ఇస్తూ అందరిని తనవైపు తిప్పుకుంటుంది. ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత మహా రాజకీయాలలో ఎన్నో ఊహించని పరిణామాలు చోటు చేసుకున్నాయి. బద్ద శత్రువులుగా భావించే కాంగ్రెస్ , ఎన్సీపీ తో శివసేన జోడి కట్టడం.. ఎన్సీపీ కీలక నేత అజిత్ పవర్ సహాయంతో రాత్రి రాత్రే బీజేపీ వ్యూహాన్ని పక్కాగా అమలు చేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అంతా చక చక జరిగిపోయింది.
కానీ , ఆ తరువాత కూడా రాజకీయ సంక్షోభానికి తెర పడలేదు. శివసేన , ఎన్సీపీ , కాంగ్రెస్ ..బీజేపీ కి సరైన బలం లేకున్నా కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని సుప్రీం కోర్టు తలుపుతట్టాయి. దీని పై విచారణ జరిపిన సుప్రీం కోర్టు బీజేపీకి షాక్ ఇస్తూ బుధవారం సాయంత్రం 5 గంటల లోపు అసెంబ్లీ లో బలం నిరూపించుకోవాలి అని సుప్రీం ధర్మాసనం తెలిపింది. "రేపు సాయంత్రం 5 గంటల లోపు అసెంబ్లీ లో బలపరీక్ష నిర్వహించాలని..అందుకు సీక్రెట్ బ్యాలెట్ అవసరం లేదని స్పష్టం చేసింది. వెంటనే ప్రొటెం స్పీకర్‌ను నియమించాలని.. అలాగే ఫ్లోర్ టెస్ట్‌ను ప్రత్యక్ష ప్రసారం చేయాలని , బలపరీక్ష కంటే ముందే ఎమ్మెల్యేల చేత ప్రమాణ స్వీకారం చేయించాలని అత్యున్నత ధర్మాసనం తెలిపింది.
సుప్రీం కోర్టు చెప్పిన ఈ సంచలన తీర్పును కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ స్వాగతించారు. సుప్రీం కోర్టు తీర్పు చారిత్రాత్మకమని ఆమె అభివర్ణించారు. అసెంబ్లీ లో బల పరీక్ష లో విపక్షాలదే విజయం అని ఆమె ధీమా వ్యక్తం చేశారు. బలపరీక్షలో ఫడ్నవీస్ సర్కార్ కూలిపోవడం ఖాయం అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. అలాగే సుప్రీం తీర్పుని శివసేన శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. సుప్రీం తీర్పు అనంతరం ఖేల్ ఖతం అంటూ ఆ పార్టీ నేత నవాబ్ మాలిక్ ట్వీట్ చేశారు. కానీ , వీరితో పాటు సీఎం ఫడ్నవిస్ కూడా విజయం తమదే అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు.