Begin typing your search above and press return to search.

టీచర్ కు కోటి రూపాయ‌లు ఇస్తాన‌ని.. ఏం చేశాడో తెలుసా?

By:  Tupaki Desk   |   24 Jun 2021 5:30 PM GMT
టీచర్ కు కోటి రూపాయ‌లు ఇస్తాన‌ని.. ఏం చేశాడో తెలుసా?
X
దురాశ దుఃఖానికి చేటు అని ఎప్ప‌డో చిన్న‌ప్పుడు చ‌దువుకున్నాం. ఇది నిజ‌మేన‌ని ఎన్నో సంఘ‌ట‌న‌లు రుజువు చేస్తున్నాయి. అయినా.. జ‌నాలు కొంచెం కూడా మార‌ట్లేదు. మొత్తం పోగొట్టుకున్న త‌ర్వాత నెత్తీనోరూ బాదుకుంటూ.. పోలీసుల‌ను ఆశ్ర‌యిస్తున్నారు. లేటెస్ట్ గా ఏం జ‌రిగిందంటే..

ఆమె సాధార‌ణ మ‌హిళేం కాదు. ఓ టీచ‌ర్‌. త‌న వ‌ద్ద ఓ పాత ఇండియ‌న్ రూపాయి కాయిన్ ఉంది. 1947వ సంవ‌త్స‌రంలో అది త‌యారైంది. పాత వ‌స్తువుల‌ను అప్పుడ‌ప్పుడూ వేలం వేస్తుంటారు క‌దా.. అదే ప‌ద్ధ‌తిని ఫాలో అయిపోయింది. వెంట‌నే ఆన్ లైన్లో అమ్మ‌కాలు, కొనుగోళ్లు జ‌రిపే యాప్ OLX లో అమ్మకానికి పెట్టింది. ఈ నెల 15వ తేదీన పోస్టు పెట్టింది.

ఈ పోస్టును చూశాడో కేటుగాడు. ఇదేదో వ‌ర్క‌వుట‌య్యేలా ఉంద‌ని భావించి, అక్క‌డ ఇచ్చిన ఫోన్ నంబ‌ర్ కు కాల్ చేశాడు. ఏ మాత్రం అనుమానం రాకుండా వివ‌రాలు మొత్తం క‌నుక్కున్న మోస‌గాడు.. ఏకంగా కోటి రూపాయ‌లు ఇస్తాన‌ని చెప్పాడు.

‘హ‌బ్బ‌.. ఒక్క రూపాయికి కోటి రూపాయలా? నా పంట పండింది’ అని అనుకుంది సదరు టీచర్. వెంటనే డబ్బులు కొట్టు.. కాయిన్ పట్టు అని చెప్పింది. దీనికి అవతలివాడు ‘తప్పకుండా’ అన్నాడు. పెద్ద మొత్తం కదా.. మీ బ్యాంక్ డీటెయిల్స్ చెప్పండి ట్రాన్స్ ఫ‌ర్ చేస్తాన‌ని అన్నాడు. వెంట‌నే పూర్తి వివ‌రాలు ఇచ్చేసింది.

డ‌బ్బులు ట్రాన్సాక్ష‌న్ అయిన‌ట్టుగా ఓ స్క్రీన్ షాట్ పంపించాడు కేటుగాడు. కానీ.. ఈమె అకౌంట్లో మాత్రం క్రెడిట్ కాలేదు. డ‌బ్బులు రాలేద‌ని ఫోన్ చేయ‌గా.. కోటి రూపాయ‌లు క‌దా ఆర్బీఐ ట్యాక్సులు చెల్లించాల్సి ఉంటుంది. ఆ మొత్త పంపండి.. వెంట‌నే రూ.కోటి మీకు వ‌చ్చేస్తాయ‌ని చెప్పాడు. అడిగినంత పంపించింది. త‌ర్వాత ఏం జ‌రిగిందో చెప్పాల్సిన అవ‌స‌రం లేదుగా. సీన్ క‌ట్ చేస్తే.. ల‌బోదిబో మంటూ పోలీస్ స్టేష‌న్ మెట్లు ఎక్కింది.