Begin typing your search above and press return to search.
రూ.2వేల నోటులో మోడీ ప్రసంగం?
By: Tupaki Desk | 20 Nov 2016 5:55 AM GMTఅందుబాటులోకి వచ్చిన టెక్నాలజీని ఎవరు ఎంతా వాడుతున్నారో చూస్తే.. అవాక్కు అయ్యే పరిస్థితి. అందరికి అన్నివిషయాల మీద అవగాహన లేకపోవటం.. వాట్సప్.. ఫేస్ బుక్ లాంటి సోషల్ మీడియా మాధ్యమాలు చురుగ్గా ఉన్న నేపథ్యంలో కొత్తగా అనిపించింది ఏదైనా.. దాని లాజిక్ గురించి ఆలోచించకుండానే ఎవరో ఏదో చెబితే దాన్నే నమ్మేసి.. ఫార్వర్డ్ చేసేస్తున్నారు. తమకు తెలిసిన కొత్త విషయాన్ని పది మందికి చెప్పాలన్న ఆత్రుత తప్పించి.. తాము చేస్తున్న ప్రచారం కారణంగా పెరిగే అలజడి.. తప్పుడు ప్రచారం ప్రజల్లో ఎంతటి ప్రభావాన్ని చూపిస్తుందన్నది అర్థం కాని పరిస్థితి.
కొత్తగా విడుదలైన రూ.2వేల నోటుకు సంబంధించి జరిగిన అసత్య ప్రచారాలు అన్నీఇన్నీ కావు. నోట్లో చిప్ ఉందని.. దాని ఆధారంగా నేల మాళిగలో రూ.2వేల నోట్ల కట్టలు ఉన్నా.. శాటిలైట్ ద్వారా గుర్తించే టెక్నాలజీ అందుబాటులోకి రానుందన్న ప్రచారం జరిగింది. అయితే.. ఇలాంటి ప్రచారంలో ఎంతమాత్రం నిజం లేదని.. అవన్నీ అసత్యాలని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తేల్చి చెప్పినా కూడా జనాల్లో ఏమూలో కాసింత అనుమానం.
జనాలు చేసే ప్రచారాల ప్రభావం ఏ స్థాయిలో ఉంటాయో చెప్పటానికి ‘చిప్’ ఉదంతం ఒక నిదర్శనమైతే.. తాజాగా రూ.2వేల నోటు విషయంలో మరోసారి ఇలాంటిదే మొదలైంది. రూ.2వేల నోటు వెనుక భాగంలో స్మార్ట్ ఫోన్ కెమెరా ఆన్ చేస్తే.. అందులో ప్రధాని మోడీ ప్రసంగం ఉందని.. రూ2వేల నోటును ప్రధాని తన ప్రచారానికి వాడుకున్నారంటూ సోషల్ మీడియాలో శనివారం నుంచి ఒక ప్రచారం భారీగా సాగింది.
ఇంతకీ ఆ ఉదంతం నిజమేనా? దీన్లో మోడీ హస్తం ఎంతన్నది చూస్తే.. ఈ తరహా ప్రచారాల్లో వాస్తవం ఇసుమంత కూడా ఉండదన్న విషయం మరోసారి స్పష్టమవుతుంది. ఒక విషయం ఒకరినోటి నుంచి మరొకరికి వెళ్లే క్రమంలో అది ఎంతలా మారిపోతుందో తెలిసిందే. ఒక టెక్నాలజీకి సంబంధించి ఒకరు చేసిన ప్రయత్నం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షించటమే కాదు.. రూ.2వేల నోట్లో మోడీ ప్రసంగాన్ని పెట్టి ప్రింట్ చేశారన్న ప్రచారం వరకూ వెళ్లటం గమనార్హం.
అసలు విషయం ఏమిటంటే.. ఇమేజ్ రికగ్నైజేషన్ అనే టెక్నాలజీలో.. ఏదైనా ఒక బొమ్మను ఆబ్జెక్టివ్ గా చేసుకొని.. దాన్ని స్మార్ట్ ఫోన్లో (ఇందుకు సంబంధించిన యాప్ ను ఫోన్లో డౌన్ లోడ్ చేసుకొని ఉండాలి సుమా) యాప్ కెమేరాను ఓపెన్ చేసి.. ఆ బొమ్మపై పెడితే.. ఆ బొమ్మకు సంబంధించిన ఏ సమాచారాన్ని అయితే పెడతామో.. అది కనిపించే పరిస్థితి. ఈ టెక్నాలజీని తాజా ఉదంతంతో లింకు చేసి చెబితే.. విషయం ఇట్టే అర్థమవుతుంది.
‘‘మోడీకి నోట్’’ మరికొన్ని యాప్ లను ప్లేస్టోర్ కి వెళ్లి డౌన్ లోడ్ చేసుకున్నాక.. కొత్తగా వచ్చిన రూ.2వేల నోటు వెనుక భాగంలో ఉన్న మంగళయాన్ ప్రాంతాన్ని.. యాప్ ను ఓపెన్ చేయగానే కెమేరా స్క్రీన్ ఆన్ అవుతుంది.దాన్ని.. నోటు వెనుక భాగంపై ఉంచితే.. స్కాన్ చేసి.. క్షణాల్లో మోడీ స్పీచ్ స్టార్ట్ అవుతుంది. వినోదం కోసం దీన్ని ఏర్పాటు చేసినట్లుగా ప్లే స్టోర్ లో యాప్ కు సంబంధించిన వారు స్పష్టంగా చెప్పినా.. జనసామ్యంలో మాత్రం.. ‘‘రూ.2వేల నోటు లోపల మోడీ ప్రసంగాన్ని డీ కోడ్ చేసి దాచి పెట్టారట’’ అన్న ప్రచారం సాగుతోంది.
అసలు విషయం తెలీక చాలామంది.. తమకు సమాచారం అందించిన వారు చెప్పినట్లే యాప్ ను డౌన్ లోడ్ చేసుకొని ఓపెన్ చేస్తే.. మోడీ ప్రసంగం కనిపిస్తున్న పరిస్థితి. ఎదుటివాడు చెప్పినట్లే రూ.2వేల నోటును స్మార్ట్ ఫోన్ లోని కెమేరాను (యాప్ ను ఓపెన్ చేయటాన్ని ఇలా ప్రచారం చేస్తున్నారు) ఓపెన్ చేసి స్కాన్ పెడితే.. మోడీ ప్రసంగం వస్తుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ తరహా ప్రచారం ఎంత ఉధృతంగా సాగుతుందనటానికి నిదర్శనంగా గూగుల్ ప్లేస్టోర్ లో ఈ యాప్ డౌన్ లోడ్ల సంఖ్యను చూస్తే.. అర్థమవుతుంది. రూ.2వేల నోటులో మోడీప్రసంగం దాచి ప్రింట్ చేయలేదన్న వాస్తవాన్ని గుర్తిస్తే మంచిది. ఇలాంటి దుష్ప్రచారం వీలైనంత వరకూ దరికి చేరకుండా ఉండటం మంచిది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/