Begin typing your search above and press return to search.
మీరు ఇప్పటివరకు చూడని రీతిలో అమీర్ పేట రోడ్డు ప్రమాదం
By: Tupaki Desk | 11 Dec 2020 10:12 AM GMTపెరిగిన ట్రాఫిక్.. బాధ్యత లేకుండా బైకు మీద వాయు వేగంతో దూసుకెళ్లే వాహనదారులు తరచూ ప్రమాదానికి గురవుతుంటారు. మనం వాడే వాహనాలకు.. మనకున్న రోడ్లకు ఏ మాత్రం పొంతన లేకుండా ఉన్న విషయం తెలిసినా.. ప్రమాదకర విన్యాసాలు చేసే యూత్ మనకు నిత్యం కనిపిస్తుంటారు. రోడ్ల మీద వెళ్లే వరకు వణుకు పుట్టేలా వారి వేగం ఉంటుంది. హైదరాబాద్ మహానగరంలో నిత్యం రోడ్డు ప్రమాదాలు పెద్ద ఎత్తున జరుగుతుంటాయి. కానీ.. ఈ రోజు (శుక్ర వారం) ఉదయం అమీర్ పేట చౌరస్తాలో చోటు చేసుకున్న ప్రమాదం మీరెప్పుడూ చూడనిది. కలలో కూడా ఊహించలేనిది.
ఈ ప్రమాద ఫోటో చూసినంతనే వణుకు పుట్టటమే కాదు.. ఇలా కూడా ప్రమాదం జరుగుతుందా? అన్నట్లు ఉండే ఈ ప్రమాదం ఇప్పుడు పెను సంచలనంగా మారింది. రోడ్డు ప్రమాదంలో ఒక కుర్రాడు అక్కడికక్కడే మరణిస్తే.. అతని వెంట ఉన్న మరో కుర్రాడు గాయాలపాలై ఉస్మానియాలో చికిత్స పొందుతున్నాడు. ఇంతకీ ఈ ప్రమాదం ఎలా జరిగిందన్న వివరాల్లోకి వెళితే..
శ్రీకాకుళం జిల్లాకు చెందిన గిరీష్ గుప్తా అనే 24 ఏళ్ల కుర్రాడు.. అతని స్నేహితుడు రవితేజ ఇద్దరు బైక్ మీద అతి వేగంగా కుకట్ పల్లి వైపు బయలుదేరారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని అమీర్ పేట మెట్రో స్టేషన్ వద్దకు రాగానే.. గిరీష్ నడుపుతున్న బైక్ అదుపు తప్పింది. దీంతో.. అతడు.. ఎగిరి రోడ్డు పక్కనే ఉన్న మెట్రో రైలింగ్ మధ్యలో తల ఇరుక్కుపోయి..అక్కడికక్కడే మరణించాడు. ఈ ప్రమాదాన్ని చూసినంతనే భీతావాహంగా ఉన్న ఈ సీన్ అక్కడున్న వారందరిని భయాన్ని కలిగించింది.
ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మరో యువకుడు రవితేజ పరిస్థితి కూడా విషమంగా ఉందని చెబుతున్నారు. అతడ్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు రైలింగ్ లో ఇరుక్కుపోయిన డెడ్ బాడీని.. గ్యాస్ కట్టర్ల సాయంతో రైలింగ్ కడ్డీల్ని కట్ చేసి.. బయటకు తీశారు. పోస్టుమార్టం నిమిత్తం అతడ్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. వేగంగా దూసుకెళ్లే వాహనదారులు ఒక్క విషయాన్ని గుర్తించాలి. వాహనాలు ఎంత అత్యాధునికమైనవైనా కావొచ్చు.. మన రోడ్లు.. మన ట్రాఫిక్ అందుకు తగ్గట్లుగా లేవన్నది మర్చిపోకూడదు. చేతికి అంది వచ్చిన కొడుకు అలా చనిపోవటాన్ని చూస్తే.. ఏ తల్లిదండ్రులకైనా అంతకు మించిన కడుపుకోత ఏముంటుంది? ఫాంటసీ కోరికల్ని తీర్చుకోవటానికి ప్రాణాల్ని పణంగా పెట్టాల్సిన అవసరం లేదు కదా?